నూరువిధాలుగా నేలని ముద్దాడచ్చు

నేను ప్రతిరోజూ ఈ రెండు పనులూ చేస్తాను. లేవగానే మంచం దిగగానే ముందు నేలమీద మోకరిల్లుతాను. రాత్రి పడుకోబోయేముందు మరొకసారి మోకరిల్లుతాను. అలా రెండు సార్లు మోకరిల్లగలిగిన ప్రతి రోజూ నాకు నా జీవితం సంపూర్ణంగా జీవించాననే అనుభూతితోనే నిద్రకి ఉపక్రమిస్తాను.