వనవాసిని-2

కాని తమ జీవితానుభవాల్ని మనతో పంచుకోవడంలో ఒక జయతి, ఒక వీణావాణి చూపిస్తున్న authenticity అద్వితీయమనిపిస్తుంది. ఎందుకంటే వారు సిద్ధాంతాలమీదగానో, లేదా సాంఘిక విమర్శదారిలోనో కాక, చిన్న చిన్న నిశ్శబ్దాలమీంచీ, పచ్చని చెట్లదారుల్లోంచీ జీవితసాఫల్యాన్ని వెతుక్కుంటున్నారనిపిస్తుంది.