ఈ ప్రపంచాన్నీ, దైవాన్నీ ఒకటిగా భావిస్తున్నప్పుడు స్టోయిక్కులు కూడా ఒకలాంటి అద్వైత దర్శనాన్ని ప్రతిపాదిస్తున్నట్టుగా మనం భావించవచ్చు. అయితే వారు దాన్ని వివరిస్తున్నప్పుడు కొన్నిసార్లు వాళ్ల మాటల్లో ఒక విధమైన ద్వైత భావన వినిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఈ ప్రపంచాన్ని దైవ శరీరం గాను దేవుణ్ఢి ఈ ప్రపంచానికి ఆత్మగాను వర్ణించడం. కానీ ఇది తాము చెప్తున్న దాన్ని మరింత వివరంగా, నిశితంగా చెప్పడం కోసం చేసే ప్రయత్నమే తప్ప నిజంగా వాళ్ల ఆలోచనల్లో ఎటువంటి ద్వైతం …