ప్రేమ లేఖ

ఎన్నేళ్ళు గానో ఎదురు చూసిన ఆ ఉత్తరం ఇన్నాళ్లకు నిన్న గుమ్మలక్ష్మీపురం మండలం టిక్కబాయిలో నా చేతికందింది.

మళ్ళా ఇన్నాళ్ళకి పార్వతీపురం దారుల్లో

1967-71 ప్రాంతాల్లో శ్రీకాకుళం గిరిజనప్రాంతాల్లో తలెత్తిన తిరుగుబాటు, అలజడీ పార్వతీపురం గిరిజన ప్రాంతాల్లోనే ప్రధానంగా సంభవించేయి. ఆ తర్వాత ఇరవయ్యేళ్ళ్ళకి, అంటే, 1987 లో నేను జిల్లా గిరిజనసంక్షేమాధికారిగా ఉద్యోగంలో చేరినప్పుడు పార్వతీపురం గిరిజనప్రాంతాల్లోనే ట్రైనింగూ, మొదటి పోస్టింగూ కూడా. అక్కణ్ణుంచి అనూహ్యపరిస్థితుల్లో 1990 లో ఆ జిల్లా వదిలిపెట్టి వచ్చేసినదాకా,ఆ అడవుల్లో నేను తిరగని చోటులేదు, ఎక్కని కొండలేదు.