ప్రియమైన శాఫో-12

ఇక్కడ నీలో అంత భావసంచలనం కలిగించింది స్త్రీనా, పురుషుడా అన్నదాని పట్ల నాకేమీ ప్రత్యేకమైన ఆసక్తి లేదు. కావలసింది అలా సంచలించిపోగల అటువంటి హృదయం. లాంగినస్ కి ఆ సంగతి తెలుసు.

కృష్ణలీలాస్మరణ

నా జీవితంలో కవిత్వం ప్రవేశించింది నా పసితనంలో. అయిదారేళ్ళ శైశవంలో మా ఊళ్ళో వేసవిరాత్రుల్లో ఆరుబయట నక్షత్రఖచిత ఆకాశం కింద మా బామ్మగారు భాగవత పద్యాలు చదువుతూండగా వినడం, గజేంద్రమోక్ష్జణం, రుక్మిణీకల్యాణం ఆమె నాతో కంఠస్థం చేయించడం నన్నొక అలౌకిక లోకానికి పరిచయం చేసాయి.