అయితే నేను చేసిన ప్రయాణాలు ఏ భౌతిక సాగరాల మీదా చేసినవి కావు. అవి విద్యారంగంలో చేసిన ప్రయాణాలు. భూమ్మీది సప్తసాగరాల్లోనూ ఉన్న రత్నాలరాసులకన్నా విలువైన రత్నాల్ని తనలో ఇముడ్చుకున్న విద్యాసముద్రం మీద నేను చేసిన ప్రయాణాలు.
ప్రియమైన శాఫో-14
ఒక్క వాక్యం శాఫో- ఈ ఒక్క వాక్యంతో నువ్వు నేనింతదాకా చదివిన మహనీయ సాహిత్య కృతులన్నిటికీ హారతి పట్టి చూపిస్తున్నావు. ఆ వెలుగులో ఆ కావ్యాల్నే కాదు, నీ మంగళమయ వదనాన్ని కూడా చూడగలుగుతున్నాను శాఫో!
