కొత్త సంవత్సరానికి కానుక

అనువాదం ఒక నిరంతర నిషిద్ధాక్షరి. వ్యత్యస్త దత్తపది. అనువాదకుడు ముందు మూలభాషలో పదాలు కాదు, కవి గుండెచప్పుడు వింటాడు. అప్పుడు తన చెవుల్ని ఆ గుండెకి దగ్గరగా చేర్చి ఆ మూల హృదయస్పందనాన్ని తన చెవుల్తో తన భాషలోకి అనువదిస్తాడు.