ఆ పల్లె, ఆ నల్లని యేరు, ఆ పచ్చికబయళ్ళు, ఆ లేగదూడలు, ఆ వల్లెవాటు, ఆ పిల్లనగ్రోవి, ఆ ఓరచూపులు ఆ పింఛం, ఆ ఓరమోము- అబ్బా! ఇది ఏ గుడికి చెందిన కృష్ణుడి గురించిన పద్యం? మా ఊళ్ళో కృష్ణుడికి ప్రత్యేకంగా ఏ గుడీ లేదుగాని, ఆ పల్లె, ఆ ఏరు, ఆ లేగలూ, ఆ నెమళ్ళూ మా ఊరివి కావా!