నిర్వికల్ప సంగీతం

p1

 

‘అద్భుతం, అంతే, మరొకమాట లేదు’ అని రాసారు అజంతాగారు ఈ పుస్తకం అందుకోగానే. వాడ్రేవు చినవీరభద్రుడు వెలువరించిన తొలికవితాసంపుటి. 1986లో ప్రచురించిన ఈ కవితాసంపుటిని దాశరథి కృష్ణమాచార్య, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ వంటివారి సమీక్షలు, ఆర్.ఎస్.సుదర్శనం, మోహనప్రసాద్, ఇస్మాయిల్, చండీదాస్, జ్యేష్ఠ వంటి వారి ప్రశంసలు లభించాయి. నూతలపాటిగంగాధరం పురస్కారం లభించింది. ఈ పుస్తకం ఇక్కణ్ణుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.


సౌభాగ్య

చినవీరభద్రుడి చిన్మయగానం

1985 తర్వాత తెలుగు కవిత్వంలో తోకచుక్కలా దూసుకొచ్చి అపురూపమైన,అసాధారణమయిన కవిత్వంతో ఆకర్షించిన కవి చినవీరభద్రుడు. పదాలకి పారిజాత పరిమళానివ్వడం ఆయనకు తెలుసు. తన స్వకీయమైన స్వరమంజరితో మన మనసుల్ని ఉల్లాసపరుస్తూభావోద్వేగంతో సాగిపోతాడు. వీరభద్రుడి విశ్వం అద్భుతాల నిలయం. ఆయన మనం నిత్యం తిరిగే చోటులోనే అడుగుపెడతాడు. మొగలివాన మొలిపిస్తాడు. చినవీరభద్రుడు జీవితాన్ని నిరంతరప్రవాహంగా జిడ్డు కృష్ణమూర్తిలా భావిస్తాడు. తనకు జన్మనిచ్చినందుకు తల్లికి నమస్కరిస్తాడు. తన కవితాగానగుణం వెనకనున్న కారణాల్ని ఆవిష్కరిస్తాడు:

అంటాడు.

వీరభద్రుడి కవిత ప్రకృతికి వేరుగా యాంత్రికమయింది కాదు. తల్లి పర్వతం, తాను ప్రవాహం. నిరంతర సాహిత్య సంచారం వీరభద్రుడి మౌలిక లక్షణం. ఏదో ఒక సిద్ధాంతానికో,సెంటిమెంటుకో, ఆఘాతానికో ఆగిపోయి రొటీన్ చర్చలు చేస్తూ కూచునే కవి కాడు వీరభద్రుడు. అతని ప్రపంచం విచ్చుకుంటున్న వినువీథి!

అంటాడు.

ఈ ప్రపంచంలో వీరభద్రుడిది కానిదేమీ లేదు. అందరి ఆనందం అతనిది. అందరి దుఃఖం అతనిది. మానవజాతికి తాను ప్రాతినిధ్యం వహిస్తానంటాడు.

ఈ భూమండల క్షణక్షణ స్పందనలు తనేనంటున్నాడు. మెత్తటి భావనలు, మృదువైన భాష, ప్రేమపూరితమయిన తన్మయ తరంగం అల్లుకున్న ఈ గంధర్వుడు నిత్యనిరంతర స్వప్నలోక సంచారి. సందేహాలు లేని అమందానంద కందళిత హృదయారవిందుడు. అతనికంటూ ఏమీ లేదు. అతనిది కానిది ఏదీ లేదు. కవిగా మాట్లాడ్డటం, రాయడం,జీవితం యివన్నీ ఏవో పురాకృత ఆశీర్వాదాల్లా అనిపిస్తాయతనికి. కవిత్వం అన్న శబ్దానికే సన్నజాజి తీగలా సంచలించి మనపై పూలవాన కురిపిస్తాడు. అతనికి ‘జీవించడం ఒక లీల.’ అతను లౌకిక వ్యవహారాలకు చిక్కడు. దేన్నీ కాదనడు. ఏ వలకూ చిక్కడు. రంగులపిట్టలా నీలాల గగనంలో తేలిపోతాడు. కవిత్వానికి ఒక ఆదిమ అచుంబిత స్వచ్ఛతని అతను ఆపాదించాడు. వీరభద్రుడు ‘అనూన కిసలయం.’అతని భావనాలోకం ‘భావస్థిరాణి జననాంతర సౌహృదాని’ గా పరవశం పొంగిపొర్లేది. భూలోకాన్ని పిల్లగాలిలా చుట్టుముట్టి తను పట్టి తెచ్చిన సీతాకోకచిలుకల్ని మనపై వొదుల్తాడు. మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. తన నిత్యకార్యక్రమాల్ని వివరిస్తాడు.

అంటాడు.

రోజువారీ జీవితంతో విసుగెత్తి, విరక్తి చెంది అలసిపోయినవాళ్ళు యితనింత ఆనందంగా ఎలా ఉన్నాడా అని ఆశ్చర్యపోతారు.

అంటాడు.

వీరభద్రుడికి దుఃఖం అలీనం కాదు. సుఖం దాటలేని నది కాదు. కానీసుఖదుఃఖాధిక ద్వంద్వాతీత బ్రహ్మానందానుభావమేదో అతను స్వర్గం నుంచీ అరువుతెచ్చుకున్నాడు. ఆ రహస్యలీల మనకు ‘అందీ అందని చేలాంచలం’లా ఊరిస్తుంది. మనం అతని భావుకతను భావించి పరవశించినందుకు సంతృప్తి పడాలి.

ప్రతిభావంతుడయిన ప్రతి కవీ తన కవిత్వ పూర్వరంగం గురించి చెప్తాడు. తన బలాన్ని, బలహీనతను వివరిస్తాడు. వీరభద్రుడు తన కవిత్వమంటే ఏమిటో నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా వివరించాడు. సాధారణంగాఆధునిక కవులు ‘ప్రపంచ సమస్యల్ని’పరిష్కరించడానికి ‘గళం, కలం’విప్పడం గురించి వింటూ వుంటాం. తమ వర్గాలనో, తెగల్నో ఉద్ధరించడానికి కంకణం కట్టుకోవడం గురించి వింటూ వుంటాం. తన కవిత్వం అట్లాంటి బృహత్తర, మహత్తర వ్యవహారాల్లోతలదూర్చడం లేదని తన కవిత్వమంటే ఏమిటో వివరించాడు.

తన కవిత్వం జనం కోసం,విమర్శకుల కోసం,కీర్తి కోసం కాదని కచ్చితంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. సమాజాన్ని మార్చాలనీ, జనాల్ని ఓదార్చాలనీ కొందరు కవులు తపిస్తూ పరితపిస్తూ కవిత్వం రాస్తూ వుంటారు. కవిత్వ ప్రయోజనమది కాదు. జీవితాన్వేషణే కవితకు పరమావధి అంటాడు వీరభద్రుడు.

అంటాడు.

వీరభద్రుడు విచిత్ర కవి.

కవులు రూపకాలు, ఉపమానాలు, ప్రతీకలు, పదచిత్రాలు పనిగట్టుకుని చక్కగా చెక్కి మెరుపులు మెరిపించి ఆకర్షించడామికి ప్రయత్నిస్తారు. వీరభద్రుడిలో అవేవీ ఉండవు, వుంటే వుంటాయి. పాడుకుంటూ వెళ్ళే స్వప్నం, పరిమళ ప్రవాహం మనల్ని తాకి వెళుతుంది. అది మనల్ని వెలిగిస్తుంది. వీరభద్రుడిలో ఉన్నది విశ్వచైతన్యం. అతని కవిత్వం చదివితే మనలో వుత్సాహం వురకలేస్తుంది. జీవించడం పట్ల నమ్మకం, బతకడం లోని ఆనందం అనుభూతి చెందుతాం. మాటలకు అర్థాలు వెతికే వాడు మందమతి. పదలలో ప్రాపంచిక అర్థాలు లాగేవాడు బండగాడో,పండితుడో అవుతాడు.

అంటాడు వీరభద్రుడు. సంగీత తరంగాల్లో తరంగితమయిన తన్మయునికి మాత్రమే వీరభద్రుడి కవిత అర్థమవుతుంది. తన్మయానికి మాటలు రావు కదా!

రవీంద్రుడి గీతాంజలి, జయదేవుడి అష్టపదులు, నన్నయ ప్రసన్న కథాకలితార్థయుక్తి, వేదగానం, ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యపవనం, వీటి వర్షంలో మొలకెత్తిన చేమంతిపువ్వు చినవీరభద్రుడు. ఆ పువ్వు గాఢజీవనపరిమళంలో తాత్త్విక పరాగం కూడా కలిసి వుంది.

ఒక తాత్త్విక కెరటం మన చెంపని ఛెళ్ళుమనిపించిపోతుంది. వీరభద్రుడు తాత్త్విక కవి. అంటే ఏదో ఒక ఫిలాసఫీని సృష్టించి దానికి వ్యాఖ్యానాలిస్తూపోయే కవి అని కాదు. జీవితంలో ఒక అనుభవం వచ్చినపుడు, జీవితాన్ని క్షణకాలం దూరం నుంచీ, దగ్గరనుంచీ, ‘డిటాచ్డ్’ గా చూసినప్పుడు వీరభద్రుడిలో ఒక కెరటం లేచి మనపై వాలుతుంది. ఇంత మధురగీతాలు, ఆనందరాగాలాలపించే ఈ స్వాప్నికుడిలో ఎంత గాఢ, గంభీర చింతన వుంది అని మ్రాన్పడిపోతాం.

ఆ సంశయం మనల్ని సంభ్రమాశ్చర్యుల్ని చేస్తుంది.

ఒక షెల్లీ, ఒక కీట్స్, ఒక రింబో, ఒక లోర్కా, ఒక ఋగ్వేద ఋషి, ఒక సూఫీ కవి, ఒక జెన్, ఒక తావో, ఒక విరాగి, ఒక అనురాగి, ఒక చినవీరభద్రుడు.

18-9-2026

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading