ఆఫ్రికా కవిత

ఆధునిక ఆఫ్రికన్ సాహిత్యం ప్రధానంగా సామాజిక-రాజకీయ అసమ్మతి సాహిత్యం, నిరసన సాహిత్యం, కోపోద్రిక్త సాహిత్యం. తన పురాతన ఆఫ్రికన్ గతానికీ, దారుణమైన వర్తమానానికీ మధ్య ఆధునికమానవుడు పడిన సంక్షోభానికి, సంఘర్షణకి వ్యక్తీకరణ ఇది. తనెవరో, తన అస్తిత్వం ఏమిటో వెతుక్కుంటూ, గుర్తుపట్టుకుంటూ చేసిన ప్రయాణం అది.

స్వధర్మం తెలిసిన సాహసి

అతడు తన దేశాన్ని తన దేశపు గ్రామాల్లో, పొలాల్లో, రైతుల్లో, ఋతువుల్లో దర్శించడానికి ప్రయత్నించాడు. అలా చూడటంలో అతడు రంగుల్ని చూశాడు. రాగాలు విన్నాడు. అవి స్పష్టంగా స్పెయిన్‌ రంగులు. కాని అతడు చూసిన స్పెయిన్‌ ఎంత స్ధానికమో, అంత విశ్వజనీనం. అందుకనే అతడు చూసిన, చూపించిన దృశ్యాల్లో నాకు నా బాల్యం, నా స్వగ్రామం, నా స్వదేశం కనిపించడంలో ఆశ్చర్యం లేదు.

సర్వజ్ఞ వచనాలు

గురజాడలాగా సర్వజ్ఞుడు కూడా పాడిపంటలు పొంగిపొర్లే దేశాన్ని కోరుకున్నాడు. ఆయన కలగన్న స్వర్గం సరళం, ఐహికం, స్వాభావికం. సకాలంలో కురిసే వాన, చక్కగా పండే పొలం, మనసు కలిసిన ఇల్లాలు, తనతో అమరిక కుదిరిన బిడ్డలు, ఆదరంతో చేరవచ్చే ఇరుగుపొరుగు-ఇంతే ఆయన కోరుకున్న లోకం. ఆకలి వేస్తే దొరికే అన్నం, నెమ్మదిగా సాగే వేసవి, నిండువెన్నెల రాత్రి, ఇవే ఆయన కోరుకున్న భోగం