ఆయన జీవితంలోకి రఘురామరాజు అనే తత్త్వశాస్త్ర విద్యార్థి ప్రవేశించాడు. తాను భట్టాచార్యకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోడానికి ప్రత్యక్షమయిన అవకాశంలాగా కనిపించాడతడు. తనకన్నా ఇరవయ్యేళ్ళు చిన్నవాడు. 1993 లో, చండీదాస్ నోరుతెరిచి అతణ్ణి అడిగాడు
నిత్యం, అనంతం
నిన్నటి ఉషనీ, నేటి ఉషనీ ఎట్లా వేరుచేయలేమో, నిన్నటి మానవుడినుంచి రేపటి మానవుణ్ణి కూడా వేరుచేసి చూపలేం. ఉష బహువచనం మాత్రమే కాదు, ఏకవచనం కూడా. మానవుడు కూడా బహువచనం మాత్రమే కాదు, ఏకవచనం కూడా. నేను ఉండను, కాని మనిషి కొనసాగుతాడు.
దివ్యానుభవం
చివరి పదికంలో మళ్ళా ఆండాళ్ చిన్నపిల్లగా మారిపోతుంది. తిరుప్పావై రోజులకన్నా చిన్నపిల్లగా. ఉల్లాసభరితురాలిగా మారిపోతుంది. పదమూడవ పదికంలో వేడినిట్టూర్పులు చిమ్మిన ఆ మోహోద్రిక్త వనిత ఎక్కడ? ఈ పసిపాప ఎక్కడ? మధ్యలో ఎమి జరిగింది?