కొండగాలి, కడలినీలిమ

సంటొక తనేద (1882-1940) ఇరవయ్యవ శతాబ్దానికి చెందిన సైగ్యో, ర్యోకాన్, బషొ అని చెప్పవలసి ఉంటుంది. ఆ పూర్వజపాన్ మహాకవుల దారిలోనే అతడు కూడా ఒక పరివ్రాజక కవిగా జీవించాడు. మొత్తం జపాన్ అంతా, ముఖ్యంగా గ్రామీణ జపాన్ అంతా కాలినడకన, సంచరించాడు.