నాది దుఃఖం లేని దేశం

కబీరు కవిత్వం నుంచి వాడ్రేవు చినవీరభద్రుడు ఏరి కూర్చిన కవితల సంకలనం, అనువాదం. తెలుగులో కబీరుకి సంబంధించి ఇంత సమగ్ర సంకలనం ఇదేనని చెప్పవచ్చు.

కబీరు-1

హీరాలాల్ మాష్టారి దగ్గర చదువుకున్నందుకైనా, తాడికొండలో ఆయన నోటివెంట లలితమధురంగా కబీర్ దోహాల్ని విన్నందుకైనా, కబీర్ ని నేరుగా హిందీలోనే ఎందుకు చదవకూడదని, ఇప్పుడు శ్యాం సుందర్ దాస్ సంకలనం చేసిన కబీర్ గ్రంథావళి సటీకంగా పఠించడం మొదలుపెట్టాను

హైకూ యాత్ర

సుప్రసిద్ధ జపనీయ హైకూ కవి మత్సువొ బషొ (1644–1694) రాసిన అయిదు యాత్రాకథనాలకు వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన తెలుగు అనువాదం. బషొ యాత్రలపైనా, ఈ అనువాదానికి చేపట్టిన పద్ధతులపైనా ఒక సమగ్రవ్యాసం కూడా ఇందులో పొందుపరిచారు.