ఊ తావో జూ

నిష్టుర యథార్థం ముందు కళాకారుడు మనిషిగా ప్రవర్తించవలసిన పద్ధతి ఏమిటని భారతీయ సాహిత్యవేత్తలూ, కళాకారులూ యుగాలుగా ఆలోచిస్తూనే ఉన్నారు. కొందరు,ఈ లోకంలోనే ఈ మనుషుల మధ్యనే తాము కూడా నిలబడి వాళ్ళ కష్టసుఖాలు పంచుకోవాలనుకున్నారు. మరి కొందరు ఊ తావూ జూలానే ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి తిరిగిరాని తీరాలకు చేరాలనుకున్నారు. ఇంకొందరు తమ కళాస్వప్నలోకపు ద్వారం దగ్గరే నిలబడి ఉంటారు, ఇటు వైపు రాలేరు, అలాగని పూర్తిగా అటువెళ్ళిపోరు.

అనుకృతి

యూరోప్ లో అయినా, ప్రాచీన చైనా లో అయినా, చిత్రకారులు కావాలనుకునేవాళ్ళకి పూర్వ చిత్రకారుల కృతుల్ని అనుకరించడమే మొదటి సాధనా, ముఖ్యసాధనా కూడా. ఆ చిత్రకారులు తమదైన సొంత గొంతు వెతుక్కున్నాక కూడా పూర్వచిత్రకారుల మీద గౌరవంతోటో, వాళ్ళ కొన్ని చిత్రాల పట్ల పట్టలేని మోహంతోనో వాటిని తాము మళ్ళా చిత్రిస్తూండటం పరిపాటి.

అస్పష్టసుస్వరవేదన

సమ్మోహనకరమైన ఇంప్రెషనిష్టు పెయింటింగ్సులాంటి ఈ ఫ్రెంచి సింబలిష్టు కవితలొక్కటే ఉన్నా కూడా ఈ పుస్తకం నాకెంతో విలువైంది అన్నాను.