వాజ్ పేయి కవిత

వాజ్ పేయి కవిత్వం ఒక రాజకీయవాది చేసే ప్రసంగంలాగా ఎక్కడా వినిపించదు. అది చాలా సన్నిహితంగా, ఒక సాధారణమానవుడు తన సందేహాల్నీ, సంఘర్షణనీ తనతోతాను సంభాషించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఆ సంభాషణలో ఒక సత్యసంధత ఉంది.

హామ్లెట్ సమస్య

ఈ ప్రపంచంలో క్రీస్తు తర్వాత అంత విస్తారంగా రాసింది హామ్లెట్ గురించేనని బుచ్చిబాబు అన్నట్టు గుర్తు. రాధాకృష్ణమూర్తిగారు హామ్లెట్ గురించి ఎలానూ రాస్తారనే అనుకున్నాం. కాని ఏమి చెప్తారా, నాలుగువందల ఏళ్ళ సాహిత్యచర్చకు అదనంగా, అన్నదే మా ఉత్కంఠ. కాని, ఆయన రాసిన ఈ వాక్యాలతో అన్నిటికన్నా ముందు ఇంగ్లీషు సాహిత్యమే సుసంపన్నమైంది.