సాదత్ హసన్ మంటో కథలు

నిన్న గాంధీ జయంతి నాడు, వనమాలి సంస్థ ప్రచురించిన 'సాదత్ హసన్ మంటో కథలు' పుస్క్తకావిష్కరణ జరిగింది. ప్రజానాట్యమండలి కళాకారులు, సామాజికకార్యకర్త, వక్త దేవి అనువాదం చేసిన కథలు. 

దేహాల సుగంధం

సాదత్ హసన్ మంటో రాసిన 'బూ' కథని ఆయన సమకాలికుడైన ఒక అభ్యుదయ రచయిత విమర్శించాడు. ఈ కథ సాధించగల సామాజిక ప్రయోజనమేమిటని అడిగాడు. కాని ఈ కథ నేను చదివిన అత్యంత కవితాత్మకమైన కథల్లో ఒకటి.

అనుభవామృతం

త్ర్యంబకం పర్యటన మీద రాసిన యాత్రావర్ణనలో (నేను తిరిగిన దారులు, 2011) సంత్ జ్ఞానేశ్వర్ గురించీ ఆయన అనుభవామృతం గురించీ నేను రాసినదానికీ, అక్కడ చేసిన రెండుమూడు అనువాదాలకీ గంగారెడ్డి సంత్ జ్ఞానేశ్వర్ కి ఒక జీవితకాల ఆరాధకుడిగామారిపోయాడు. ఆ తర్వాత ఆ మధ్య ఒక రోజు జ్ఞానేశ్వరి చదువుతున్నానని చెప్పాడు.