కొత్త ఇంట్లో పుస్తకాలు సర్దుకుంటూండగా ఇస్మాయిల్ గారి 'పల్లెలో మా పాత ఇల్లు ' (2006) కనబడింది. ఆదివారం తీరికదనంలో ఆ కవిత్వం నెర్రెల్లోకి నీళ్ళు పారినట్టు సూటిగా లోతుగా చొరబడిపోయింది.
రమణా సుమనశ్రీ అవార్డు
26 సాయంకాలం గోల్డెన్ త్రెషోల్డ్ ప్రాంగణంలో ప్రసిద్ధ కవి, ఆత్మీయమిత్రుడు సుమనశ్రీ కె.శివారెడ్డి ఇటీవలి కవితాసంపుటి 'గాథ ' కీ, నా కవితా సంపుటం 'నీటిరంగుల చిత్రం ' కీ రమణా సుమనశ్రీ అవార్డులు అందించాడు. ఆ సత్కార సమావేశానికి మరొక ప్రసిద్ధ కవి, భావుకుడు దీవి సుబ్బారావుగారు అధ్యక్షత వహించారు.
క్రూరపాశము మోహబంధము
వారం రోజుల కిందట వాల్డెన్ లో ఫైజ్ మీద కొత్త పుస్తకం కనబడితే తెచ్చుకున్నాను. 'ద బెస్ట్ ఆఫ్ ఫైజ్ అహ్మద్ ఫైజ్ ' (వింటేజ్ క్లాసిక్స్, 2013). శివ్ కె కుమార్ అనువాదం. ' ఓ సిటీ ఆఫ్ లైట్స్' (ఆక్స్ ఫర్డ్, 2006), '100 పొయెంస్ బై ఫైజ్ అహ్మద్ ఫైజ్ ' (అభినవ్ పబ్లికేషన్స్, 2009) తరువాత, ఇది మూడవ పుస్తకం ఫైజ్ మీద నా అలమారులో.