మామిడికొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే

మామిడిచెట్టు ఏడాదిలో ఆరునెలలు నిద్రపోతుంది. ఆరునెలలు పరిపూర్ణంగా జీవిస్తుంది. పూర్తి ఉత్సాహంతో, మహావైభవంతో జీవిస్తుంది. మాఘమాసంలో పూత, ఫాల్గుణంలో పిందె, వైశాఖంలో రసాలూరే ఫలాలు-ఇంత త్వరత్వరగా పుష్పించి, ఫలించే ఈ వైనం ఒక సంస్కృతకవికి ప్రేమవ్యవహారంలాగా అనిపించింది

నా జీవితాన్ని మార్చిన పుస్తకాలు

మీకు నచ్చిన అయిదు పుస్తకాల పేర్లు చెప్పండి అని అడిగాడో మిత్రుడు. 'నచ్చినవా? మెచ్చినవా? తెలుగులోనా? ప్రపంచ సాహిత్యంలోనా ' అనడిగాను.  'ప్రపంచసాహిత్యంలోంచే చెప్పండి ' అన్నాడు. ఆలోచించాను, ఒక రోజంతా. నచ్చినవీ, మెచ్చినవీ చాలానే ఉన్నాయి. ఎంచడం కష్టమే కాని, ఏదోలా ఎంచి చూపించవచ్చు. 

స్వాగతం మేఘమా!

ఎన్నేళ్ళయింది మృగశిర కార్తె అడుగుపెట్టిన రోజునే తొలకరి జల్లు పలకరించి! జల్లు కూడా కాదు, సముద్రమే ఆకాశం మీంచి ప్రయాణిస్తున్నట్టుంది! ఋతుపవనమేఘమిట్లా అడుగుపెట్టవలసిననాడే అడుగుపెట్టడం కన్నా భారతీయ ఆకాశానికీ, భారతీయ సుక్షేత్రానికీ శుభవార్త మరేముంటుంది! అంతకన్నా సత్యం, శివం, సౌందర్యమేముంటుది!