మొదటి స్వతంత్ర కావ్యం

అసలు తెలుగు సాహిత్యంలో పదిహేనో శతాబ్ది కవులందరిదీ ఒక ప్రత్యేకమైన అధ్యాయం. పిల్లలమర్రి పినవీరన, శ్రీనాథుడు, పోతన, అన్నమయ్య- ఈ నలుగురూ పదిహేనో శతాబ్ది పొడుగునా శృంగార, వైరాగ్యాల మధ్య నలిగిపోయారు.