వేదార్థ మీమాంస

Vedhardha Meemamsa-1

సమకాలీన భారతీయ దార్శనికుల్లో అగ్రేసరుడైన డా.కొత్త సచ్చిదానందమూర్తి వేదాలను అర్థం చేసుకోవడానికీ, వ్యాఖ్యానించడానికీ చేసిన ప్రయత్నం ఈ పుస్తకం. వేదాలపై ఇంతదాకా వచ్చిన ఆధునిక భారతీయ, పాశ్చాత్య వ్యాఖ్యానాల గురించి ఆయనకు క్షుణ్ణంగా తెలుసు, అయినప్పటికీ, ఆయన వేదాలను అర్థం చేసుకోవడం కోసం ప్రధానంగా నిరుక్తం వైపూ, పూర్వ ఉత్తర మీమాంసల వైపూ, స్మృతి, ఇతిహాస, పురాణాల వైపూ, సాయణుల వైపూ, ఇతర భాష్యకారుల వైపూ మొగ్గు చూపడం ఈ రచనలో విశేషం.

ఇంగ్లీషులో Vedic Hermeneutics పేరిట వెలువడిన ఈ గ్రంథాన్ని ఎమెస్కో ‘పొరుగు నుంచి తెలుగులోకి’ పుస్తకమాలికలో భాగంగా వాడ్రేవు చినవీరభద్రుడు తెలుగు చేసారు, విపులమైన పరిచయ వ్యాసం కూడా పొందుపరిచారు.

ఈ పుస్తకం అన్ని విక్రయకేంద్రాల్లోనూ లభ్యమవుతున్నది.

 

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading