నేను తిరిగిన దారులు-17

త్రయంబకం యజామహే

4

దత్త భూమి

జ్ఞానదేవుడు చేసిన కృషి గురించి తలుచుకుంటున్నప్పుడు నాకు మరొక విషయం కూడా స్ఫురించింది. 13 వ శతాబ్దపు దక్షిణభారతదేశంలో ఒక మరాఠీ కవి చేసిన ప్రయత్నానికీ, ఆయన సమకాలీనుడైన ఒక తెలుగుకవి చేసిన ప్రయత్నాలకూ మధ్య చాలా తేడా ఉందనిపించింది. జ్ఞానదేవుడు (1275-1296), తిక్కన (1205-88) కన్నా వయసులో చిన్నవాడే అయినా, సమకాలీనుడే. ఇద్దరూ పూర్తి దేశభాషల్లోనే కవిత చెప్పారు. అయితే, తిక్కన మహాభారతంలో భగవద్గీతను సంగ్రహంగా మాత్రమే అనువదించి వదిలిపెట్టగా, జ్ఞానేశ్వరుడు భగవద్గీతను మాత్రమే ఎంచుకుని దానికి భాష్యం చెప్పాడు. తిక్కన తెలుగువాళ్ళకి ఎంతో ఇష్టమైన భారతకథనే ఎంతో నాటకీయంగా చెప్పినప్పటికీ, అయన పద్యరచనలో అన్వయక్లిష్టత లేదనలేం. కాని భగవద్గీతవంటి వేదాంతానికి అద్వైతదృష్టితో వ్యాఖ్యానం చెప్పినా, తన రచన ‘చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకునేటంత సులువుగా ఉంటుందని’ జ్ఞానేశ్వరుడే చెప్పుకున్నాడు.

కవిత్రయం భారతాన్ని తెలుగుచేయడంతో వెయ్యేళ్ళ తెలుగుకవితా ప్రస్థానం మొదలైనమాట నిజమేకాని, వాళ్ళు రాజాస్థానాల్లో రాజగురువులుగా, అమాత్యులుగా, మంత్రాంగం నడిపినవారుగా ఉండటం వల్ల, కవికీ, రాజాస్థానానికీ మధ్య సంబంధం తదనంతరం కూడా అలానే కొనసాగుతూవచ్చింది. తెలుగుకవిత్వం, అప్పణ్ణుంచి ఇప్పటిదాకా, ప్రధానంగా రాజకీయకవిత్వం. తెలుగుకవి సౌందర్యారాధకుడిగానో, సత్యాన్వేషకుడిగానో ఉండటంకన్నా, రాజనీతిజ్ఞుడిగా ఉండటాన్నే ఎక్కువ ఇష్టపడ్డాడు. తమ కాలంనాటి రాజకీయసుస్థిరత్వాన్ని కాపాడటానికీ, తద్వారా కొన్ని విలువల్ని రక్షించుకోడానికీ తెలుగుకవి ఎక్కువ ఆరాటపడ్డాడు. లేదా ఆ విలువల్ని వేమనలాగా ధిక్కరించడం పట్ల మొగ్గుచూపాడు. అలాకాక, రాజస్నేహాన్ని తిరస్కరించి దేవుడి చుట్టూ కవిత చెప్పిన పోతన, అన్నమయ్య, త్యాగయ్య వంటివారు లేకపోలేదుగాని, వారిని ప్రధానస్రవంతి సాహిత్యం ఎప్పుడూ పక్కన పెడుతూనే ఉంది. ఈ సంప్రదాయానికి మూలాలు కవిత్రయంలోనే ఉన్నాయి.

కాని మరాఠీ కవిత్వం, దానివల్ల ప్రభావితమైన ఉత్తరాది భక్తికవిత్వాలు ఇందుకు భిన్నంగా నడవడానికి కారణం జ్ఞానేశ్వరుడిలో ఉందనిపిస్తోంది. సమకాలీన సాంఘికవిలువల క్రూరత్వం ఎలా ఉంటుందో జ్ఞానేశ్వరుడు స్వయంగా అనుభవించాడు. కులం పేరిట, సంప్రదాయం పేరిట లభించిన జ్ఞానం కన్నా, గురుశిష్యసంప్రదాయంద్వారా అందే జ్ఞానం ఎన్నో రెట్లు విలువైందని ఆయన భావించాడు. అక్కడ గురువు అంటే, మరొక మానవుడు, ప్రేమైకమానవుడు, మనుషులందరిపట్లా ఉండే ప్రేమతో తన స్వానుభవాన్ని నలుగురికీ అందించడం కోసం ఒక శిష్యుణ్ణి వెతుక్కునే పిపాసి. సాంప్రదాయిక జ్ఞానం సంస్థాగతం. దానికి మనుషుల రాగద్వేషాలతో సంబంధం లేదు. కాని గురువు అందించే జ్ఞానం మానవీయం. అది ఒక మనిషి ముఖతః మరొక మనిషికి అందేది.

తన గురువునుంచి తనకు అందుతున్న స్ఫూర్తి అనాదినుంచీ వస్తున్నదని ఆయన నమ్మాడు. సాక్షాత్తూ శివుడే పార్వతికి బోధించిన రహస్యం ఎట్లానో మత్యేంద్రనాథుడికి, ఆయన్నుంచి చౌరంగినాథుడికి, గోరక్షానాథుడికి అందింది. దాన్ని గోరఖ్  నాథుడు గహినీనాథుడికి బోధిస్తే, అది గహినీనుంచి నివృత్తినాథుడికి అందింది. నివృత్తినాథుడి దయవల్ల జ్ఞానేశ్వరుడు తాను పొందిన సాక్షాత్కారాన్ని నలుగురికీ అర్థమయ్యేలా చెప్పాడు. అక్కణ్ణుంచి ఒక రహస్యనాథసంప్రదాయం ఒక బహిరంగ కవిపరంపరగా మారింది. జ్ఞానదేవుడినుంచి నామదేవ్, ఏకనాథ్, తుకారామ్ల మీదుగా ఒకవైపు మరాఠీ కవితాస్రోతస్వినిగా, మరొకవైపు నామదేవ్ నుంచి నానక్ మీదుగా పంజాబీ సిఖు భక్తిధారగా, మరొకవైపు కబీర్, రవిదాస్, సూర్దాస్ మీదుగా హిందీ భక్తికవితాధారగా విస్తరిల్లింది. తిరిగి ఈ భక్తిస్రోతస్వినులు వల్లభసంప్రదాయంతో, చైతన్యసంప్రదాయంతో, కాశ్మీరుశివాద్వైత సంప్రదాయాలతో మేళవించి మరెన్నో భక్తికవితాధారలుగా మారి భారతభూమిని పావనం చేస్తూవచ్చాయి. గోదావరీ మహాప్రవాహం తొలిరూపంలో త్రయంబకం కొండలమీద గోచరించినట్టే, ఈ భక్తివాహిని తొలిరూపంలో జ్ఞానేశ్వరుడి ‘భావార్థదీపిక’గా గోచరించింది. ఆ పరిణామాన్నే మరొక భక్తి కవయిత్రి బహినాబాయి ఇట్లా వర్ణించింది:

జ్ఞానేశ్వరుడి కవిత్వం మరొక రూపంకూడా తీసుకుంది. పండరిపురానికి వార్కరి యాత్ర చేసే సంప్రదాయాన్ని కూడా ఆయనే మొదలుపెట్టాడు. ప్రతి ఏడాదీ ఆషాఢంలో, కార్తీకంలో వార్కారీలు పండరికి చేసే యాత్ర ఆధ్యాత్మిక యాత్రకాదు. సంగీత యాత్ర, సాహిత్యయాత్ర. గత ఏడుశతాబ్దాలుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తూన్న యాత్ర అది. ఆ యాత్రలోంచే నామదేవ్, ఏకనాథ్, తుకారామ్ వంటి మహాకవులు ప్రభవించారు. వాళ్ళ అభంగాలతో మహారాష్ట్రమొత్తం పులకిస్తూనేవుంది. వెయ్యేళ్ల తెలుగుకవిత్వంలో ఇటువంటి మహాసంప్రదాయాన్ని ప్రవేశపెట్టిన కవి ఎవ్వరూ కనిపించరు. అన్నమయ్య శ్రీవేంకటేశ్వరుడికి సంకీర్తనార్చన చేసాడు, కాని ఇటువంటి సంగీతయాత్రని సంకల్పించలేదు. క్షేత్రయ్య దేవాలయాలూ, రాజస్థానాలూ ఏ ఒక్కటీ వదిలిపెట్టకుండా తిరిగాడుగాని, తన యాత్రను నలుగురి యాత్రగా మార్చలేదు. మహదేవ్ గోవింద్ రనడే అన్నట్టుగా జ్ఞానదేవ్ ప్రారంభించిన వార్కరి సంప్రదాయం వల్ల ‘ఆధ్యాత్మికజీవితంలో ప్రజాస్వామ్యం ప్రవేశించింది’.

నెమ్మదిగా పొద్దు వాలుతోంది. బంగారురంగు సూర్యకాంతి సహ్యాద్రిశ్రేణి అంతటా పరచుకుంది. బ్రహ్మగిరి శిఖరతలంమీద సాయంకాలపు ఎండ పడుతుంటే ఆ శిఖరాలకు బంగారం తాపడం చేసినట్టు ఉంది. నేను నదీమూలం దర్శిద్దామని వచ్చాను. నా అదృష్టంవల్ల ఒక ఋషిపరంపరమూలం కూడా ఇక్కడ నాకు గోచరించింది. మెట్లు దిగుతూండగా కొందరు పిల్లలు కనబడ్డారు. ఒక పిల్లవాడు పిల్లంగోవి వూదుతున్నాడు. చూడగానే ఆదివాసిపిల్లలని తెలుస్తోంది.

‘మీరెవరు’ అని అడిగాను.

‘మేం ఆదివాసి మహదేవ్ కోలీలం’ అని చెప్పాడొక పిల్లవాడు. దగ్గరలో లోయలో కనిపిస్తున్న ఒక ఆదివాసిగూడేన్ని చూపించి ‘అదే మా పల్లె’ అన్నాడు.

నేను ఎక్కడకు వెళ్లినా, ఇలాంటప్పుడే, తిరిగి తిరిగి మా ఊరికే వెళ్తున్నాననిపిస్తుంది. ఈ దేశంలో ప్రతి ఒక్క కొండ, నది, అడవి, మైదానం నాకెప్పటినుంచో తెలిసినట్టే కనిపిస్తుంటాయి. నన్నెంతో ఆత్మీయంగా పలకరిస్తున్నట్టుంటాయి. మరీ ముఖ్యంగా ఈ సహ్యాద్రిపైన ఏ చెట్టు చూసినా ఆ నీడన దత్తాత్రేయులు కూచున్నట్టే అనిపిస్తోంది. నువ్వు చూసే ప్రతి ఒక్క దృగ్విషయం ఆధారంగా నువ్వు చూడలేని మహాసత్యాన్ని నువ్వెట్లా చూడాలో ఆయన బోధిస్తున్నట్టే ఉంది. అప్పుడు నాకు నేను నివసిస్తున్న దేశం 21 వ శతాబ్దంలోకి అడుగుపెట్టిందంటే నమ్మకం కాలేదు. కాలాతీతమైన ఒక మహాస్తిత్వం ఎదట నిలబడ్డట్టే అనిపించింది. నేను చేరవలసిన చోటుకే చేరాననీ, చూడవలసిన చోటునే చూసాననీ, వినవలసిన సందేశాన్నే విన్నాననీ అనిపించింది.

మేం కొండదిగి త్రయంబకేశ్వరుడి ఆలయంలో అడుగుపెట్టేటప్పటికి నవమిచంద్రుడు ఉదయించాడు. ఆ లేతవెన్నెలకాంతిలో నల్లని ప్రాకారం మెరుస్తోంది. జ్యోతిర్లింగదర్శనం కాగానే మేమా మధ్యాహ్నం నుంచీ తిరుగుతున్న ప్రాంతమంతా కూడా ఒక మహాజ్యోతిర్లింగక్షేత్రమనే స్ఫురించింది.

5

తపోభూమి

మేం త్వరత్వరగా షిర్డి దారి పట్టాం. పొద్దుణ్ణించీ ఏమీ తినకపోవడంవల్లా, కొండ ఎక్కి దిగిన ఆయాసం వల్లా ఆకలేస్తోంది. అందుకని నాసిక్ లో  ఆగగానే మేం చేసిన మొట్టమొదటి పని ఒక హోటల్ పట్టుకోవడం. ఆ రాత్రి ఆ హోటల్లో మాకు ఆత్మీయత రంగరించిన ఆతిథ్యం లభించింది. వడ్డించేవాళ్ళు అడిగి అడిగి కొసరి కొసరి వేడివేడి రొట్టెలు తినిపిస్తుంటే ఆవురావురుమంటూ తిన్నాం.

అప్పుడు ఆ చీకట్లోనే నాసిక్ లో  రామ్ కుండి కి వెళ్లాం. అక్కడ గోదావరి ఒక చిన్నకాలువలాగా ఉంది. నది చుట్టూ దేవాలయాలు, స్నానం చేస్తున్న భక్తులు, కొందరు గోదావరిలో దీపాలు వదుల్తున్నారు. నాకు ఆ దృశ్యం నా చిన్నప్పుడు చూసిన రాజమండ్రిని గుర్తుకు తెచ్చింది. అసలు నాసిక్ గాలిలోనే ఏదో చాలా దగ్గరితనం స్ఫురిస్తూ ఉంది. నేను ఎప్పుడో ఇక్కడ ఉన్నాననీ, కొంతకాలం ఇక్కడ గడిపాననీ అనిపిస్తూవుంది. బహుశా, గౌతమీపుత్రశాతకర్ణి, తన తల్లి గౌతమీబాలసిరి పేరుమీద, శాసనం రాయిస్తూన్నప్పుడు ఆ లేఖకుల్లో నేను కూడా ఒకణ్ణి ఉండవచ్చనుకుంటాను. ఇట్లా హడావుడిగా ఈ చీకట్లో కాదు, మరోసారి ఎప్పుడేనా తీరుబడిగా వచ్చి ఈ చుట్టుపక్కల తిరిగి నా పూర్వజన్మజ్ఞాపకాల్ని పోల్చుకోవాలను కున్నాను.

మేం షిర్డి చేరేటప్పటికి రాత్రి పదిదాటింది. తెల్లవారితే విజయదశమి. బాబా మహాసమాధి చెందిన రోజు. షిర్డి అంతా ఒక పండగలాగా ఉంది. ఒకటే జనసముద్రం. నేరుగా సమాధిమందిరం దగ్గరకు పోయాం. లోపల రాత్రి హారతి జరుగుతోంది. ‘ఆరతీ జ్ఞానరాజా, మహా కైవల్య తేజా, సేవితీ సాధుసంత, మనువేదలా మాఝా’ అని ఎలుగెత్తి పాడుతున్నారు. నేను నిజంగానే ఒక తపోభూమిలో ఉన్నాననిపించింది. త్రయంబకంనుంచి పండరిపురందాకా ఈ నేలనంతా సాధుసంతులొక తపోవనంగా మార్చేశారు. ఇక్కడ అనేక శతాబ్దాలుగా అసంఖ్యాకమానవులు తమ జీవితాలను ప్రార్థనాగీతాలుగా, హారతిజ్యోతులుగా మార్చేసుకున్నారు. ఏ అతీతకాలంలో పరమశివుడు పార్వతీదేవి చెవిలో ఏ రహస్యసంభాషణ చేశాడోగాని ఆ రహస్యాన్ని ప్రజాస్వామికం చేయడం కోసమే జ్ఞానేశ్వరుడినుంచి సాయినాథుడిదాకా ఒక ఆధ్యాత్మిక ఉద్యమం కొనసాగుతూ వస్తోందనిపించింది. నేను పొద్దుణ్ణుంచీ అటువంటి ఒక ఆధ్యాత్మిక మహాసాగరం ఎదట నిల్చుని ఆ కెరటాలు ఎగిసిపడుతుండటం చూస్తున్నాను. ఆ తరంగాలట్లా ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే కొన్ని జలకణాలు నా మీద కూడా పడుతూ నన్ను ప్రేమగా తడుపుతున్నాయనిపించింది.

యాత్రాకాలం, 2007; రచన, 2011


4

The Land of Datta

Reflecting upon the monumental endeavor of Jnanadeva, another realization dawned on me. There was a stark, fascinating contrast between what a Marathi poet undertook in thirteenth-century South India and what a contemporary Telugu poet set out to do. Jnanadeva (1275–1296), though younger in years than Tikkana (1205–1288), was essentially his contemporary. Both sang their poetry entirely in the regional vernaculars (desi bhashas). Yet, while Tikkana translated the Bhagavad Gita within the Mahabharata only in brief, passing summary, Jnaneshwar chose the Bhagavad Gita exclusively and illuminated it with an extensive, verse-by-verse commentary. Even though Tikkana narrated the beloved story of the Bharata with consummate dramatic power for Telugu readers, one cannot deny the syntactic density and poetic intricacy of his metrical style. But Jnaneshwar, even while expounding a philosophy as profound as the Gita from the non-dual standpoint of Advaita, declared that his composition was framed so simply that “even children can effortlessly understand it.”

It is true that the thousand-year journey of Telugu literature commenced with the Trinity of Poets (Kavitrayam) rendering the Mahabharata into Telugu. Yet, because they served in royal courts as royal preceptors, ministers, and statesmen steering statecraft, the alliance between the poet and the royal court persisted unbroken in the centuries that followed. Telugu poetry, from then down to the present, has remained primarily a political literature. Far more than being a worshipper of beauty or a seeker of truth, the Telugu poet preferred to be a political thinker, an advisor on statecraft. The Telugu poet was constantly preoccupied with safeguarding the political stability of his era and, through it, preserving certain social and civilizational values—or, like Vemana, passionately inclined toward defying those very orthodoxies. To be sure, there were figures like Pothana, Annamayya, and Tyagayya who rejected royal patronage and centered their verse entirely upon the Divine; yet mainstream literary history has consistently kept them relegated to the margins. The roots of this mainstream disposition lie in the Kavitrayam themselves.

By contrast, the reason Marathi poetry—and through its influence, the vast Bhakti literature of North India—took a radically different course seems to rest squarely with Jnaneshwar. Jnaneshwar had tasted firsthand the ruthless cruelty of contemporary social orthodoxy. He realized that the wisdom handed down through the intimate bond of the Guru-disciple tradition (guru-shishya parampara) was infinitely more precious than formal learning peddled in the name of caste and dead conventions. There, the Guru is another human being—a being overflowing with pure love, an impassioned soul who, out of boundless affection for humanity, seeks out a disciple simply to share his direct living realization with the world. Institutionalized traditional knowledge is rigid and impersonal; it has nothing to do with the heart’s attachments and sorrows. But the wisdom bestowed by a master is deeply human, passed directly from mouth to mouth, soul to soul, from one person to another.

Jnaneshwar believed that the inspiration flowing to him from his Guru traced back to the primordial dawn of time. The secret wisdom that Shiva Himself once imparted to Parvati was somehow transmitted to Matsyendranath, and from him to Chauranginath and Gorakshanath. When Gorakhnath instructed Gahininath, it passed from Gahini to Nivruttinath. And through Nivruttinath’s grace, Jnaneshwar articulated his direct spiritual awakening in words the common people could comprehend.

From that single spark, what had been an esoteric Nath tradition transformed into a luminous, public lineage of devotional poetry. Flowing from Jnanadev through Namdev, Eknath, and Tukaram, it surged on one side as the perennial river of Marathi poetry; from Namdev through Guru Nanak, it streamed as the Sikh Bhakti current of Punjab; and through Kabir, Ravidas, and Surdas, it broadened into the vast ocean of Hindi Bhakti verse. Merging in turn with the Vallabha sampradaya, the Chaitanya tradition, and Kashmir Shaiva Advaita, these devotional streams branched into countless rivers of mystical song, sanctifying the soil of India.

Just as the mighty sweep of the Godavari first revealed itself on the heights of Trimbakeshwar as a tiny trickle, so did this great flood of Bhakti first manifest in Jnaneshwar’s Bhavartha Dipika. The mystic poetess Bahinabai captured this glorious evolution in an unforgettable abhanga:

Jnaneshwar’s poetry took on yet another profound form. It was he who inaugurated the tradition of the Varkari pilgrimage to Pandharpur. The pilgrimage that the Varkaris undertake to Pandharpur every year in the months of Ashadha and Kartika is not merely an ascetic pursuit; it is a pilgrimage of music, a pilgrimage of literature. For the past seven centuries, it has flowed as an unbroken stream. It was out of that very pilgrimage that great poet-saints like Namdev, Eknath, and Tukaram were born. To this day, the entire land of Maharashtra thrills to the resonance of their abhangas.

In the thousand-year history of Telugu poetry, one searches in vain for a poet who instituted so magnificent a collective tradition. Annamayya offered a perpetual worship of song (sankīrtanārcana) to Lord Venkateswara, yet he did not envision such a shared, moving pilgrimage of melody. Kshetrayya traversed the land, leaving hardly a single temple or royal court unvisited, but he never transformed his wandering into a collective journey of the people. As Mahadev Govind Ranade observed, through the Vaarkari tradition inaugurated by Jnanadev, “democracy entered the spiritual life.”

Slowly, the sun began to decline. Golden sunlight washed across the entire expanse of the Sahyadri range. As the evening rays slanted across the plateau of Brahmagiri, the peaks appeared as though overlaid with beaten gold. I had set out on this journey yearning to behold the wellspring of a river; by my sheer good fortune, the wellspring of an illustrious lineage of rishis had also revealed itself to me here.

Descending the stone steps, I came across a few children. One boy was playing a bamboo flute. A single glance was enough to tell they were Adivasi children.

“Who are you?” I asked.

“We are Adivasi Mahadev Kolis,” one of the boys answered. Pointing toward a small hamlet cradled in the nearby valley, he added, “Look, that is our village.”

Wherever I journey across this earth, it is precisely in moments such as these that I feel I am returning, again and again, to my own village. Every hill, river, forest, and plain in this land appears to me as something intimately known since time immemorial, greeting me with tender kinship. And here, upon these Sahyadri heights, beneath whichever tree my gaze falls upon, it feels as though Lord Dattatreya Himself is seated in the shade—instructing one how to look through every passing phenomenon to perceive the unmanifest, supreme Truth beyond.

At that moment, I could hardly believe that the land in which I lived had stepped into the twenty-first century. It felt as if I were standing before a timeless, primordial Presence. A quiet assurance settled within me: I had arrived at the very destination I was meant to reach; I had gazed upon the very ground I was destined to behold; I had received the very message I was meant to hear.

By the time we descended the mountain and stepped into the temple of Tryambakeshwar, the crescent moon of the ninth lunar night (navami) had risen in the sky. In that tender moonlight, the black stone ramparts of the temple glistened with a quiet luster. As soon as the darshan of the Jyotirlinga was complete, the revelation dawned upon me: that entire landscape through which we had wandered since noon was itself one vast, living realm of the Jyotirlinga.

5

The Realm of Austerity

We quickly set out on the road back to Shirdi. Having eaten nothing since morning, and worn out by the exertion of climbing up and down the mountain, ravenous hunger overtook us. The very first thing we did upon pulling into Nashik was to seek out a hotel. That night, the eatery welcomed us with warmth and hospitality. As the servers came around inquiring attentively, urging us to take more and serving piping-hot rotis fresh off the fire, we ate voraciously.

Afterward, in that enveloping darkness, we made our way to Ramkund in Nashik. There, the Godavari flowed like a modest stream. All around the water stood temples and devotees bathing along the ghats; a few were releasing floating earthen lamps into the currents of the river. That sight brought back memories of the Rajahmundry I had known in my boyhood. Indeed, the very air of Nashik breathed an unmistakable intimacy. A persistent feeling stirred within me that I had lived here long ago, that I had spent a lifetime in this ancient land. Perhaps, when Gautamiputra Satakarni had the famous royal inscription engraved in the name of his mother, Gautami Balasri, I might well have been one among those court scribes! Not in such haste swallowed by night, but someday at leisure, I resolved to return, wander through these ancient surroundings, and trace the lingering memories of past births.

By the time we reached Shirdi, it was past ten in the night. Tomorrow was Vijayadasami—the sacred day of Baba’s Mahasamadhi. All of Shirdi buzzed like a festive celebration, submerged in an immense sea of humanity. We walked straight toward the Samadhi Mandir. Inside, the night aarati was underway. Voices rose in unison, singing aloud with deep devotion:

I felt with absolute certainty that I was standing in a sacred realm of penance—a true tapobhumi. From Trimbakeshwar all the way to Pandharpur, the saint-poets had transformed this entire soil into a vast, living hermitage. Across centuries, countless human beings here had transmuted their everyday lives into devotional songs and blazing lamps of worship. Whatever secret discourse Lord Shiva had whispered into the ear of Parvati in that primordial dawn of time, it felt as though an unbroken spiritual movement—from Jnaneshwar down to Sai Nath—had been flowing continuously merely to democratize that divine secret for all humankind.

Since dawn, I had been standing before just such a boundless spiritual ocean, watching its waves surge and crest. And as those luminous waves rose high, it felt as though a few sacred droplets were splashing gently upon me, drenching my being in boundless love.

(Journey: 2007; Written: 2011)

15-9-2026

8 Replies to “నేను తిరిగిన దారులు-17”

  1. మేము తిరగలేని చోటికల్లా తీసుకువెళ్లి చూపిస్తున్న శ్రవణ కుమారుడికి..🛐

  2. చదువుతుంటే టాగూరు గీతం గుర్తుకు వచ్చింది-
    ఎచటనైతే భయముచెందని మనసుతో తల ఎత్తవచ్చునొ
    ఎచటనైతే జ్ఞానకాంతులు స్వేచ్ఛగా ప్రసరించవచ్చునొ
    ఎచటనైతే ఇరుకు భావపు గోడలతొ భువి వేరుపడదో
    ఎచటనైతే సత్యగర్భమునుండి పలుకులు వెలికి వచ్చునొ
    ఎచట పరిపూర్ణతకు నిరతము యత్నములు కొనసాగుచండునొ
    ఎచట నిర్మల హేతువాహిని భయదమౌ నిర్జీవ సంస్కృతి ఇసుక భూముల దారితప్పదొ
    నిత్యవిస్తర విశాలమ్మగు
    భావములు కృత్యముల మా మది
    ఎచట నీచే నడపబడునో
    అచటనే ఆ స్వేచ్ఛామయ స్వర్గమందున
    జనకుడా! నాదేశమచ్చట మేలుకోనీ!🙏

    1. చాలా సంతోషం సార్! మీ ఆత్మ సంస్కారం చాలా గొప్పది. అందుకనే సమాన భావాలు సమానంగా మీ హృదయంలో ప్రతిధ్వనిస్తాయి.

  3. గురువు అంటే, మరొక మానవుడు, ప్రేమైకమానవుడు, మనుషులందరిపట్లా ఉండే ప్రేమతో తన స్వానుభవాన్ని నలుగురికీ అందించడం కోసం ఒక శిష్యుణ్ణి వెతుక్కునే పిపాసి.

    ఈ గురుబోధల వల్లనే భక్తికవితాధారలు స్రవించాయని తెలుసుకోవడం ఆనందం.

  4. తెలుగు కవిత్వం రాజాస్థానాలతో, రాజకీయాలతో ముడిపడి ఉండటం వల్ల ఏ విధంగా రాజకీయ కవిత్వంగా మారిందో, దానికి భిన్నంగా జ్ఞానేశ్వరుడి నుంచి మొదలైన మరాఠీ కవిత్వం ఏ విధంగా ప్రజల మధ్యకి, యాత్రల్లోకి, సంగీతంలోకి విస్తరించి, ఆ తర్వాత హిందీ, పంజాబీ భక్తికవిత్వాలపై కూడా ప్రభావం చూపిందన్న insights చాలా interesting Sir!!

    I really appreciate how you bring together historical, cultural, సాహిత్య, and spiritual perspectives, making this travelogue so enlightening. 🙏🏽

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading