తాళ్ళపాక

సాహిత్యం అందించగల అత్యుత్తమ రసానుభూతి మన హృదయాల్లో సాత్త్వికోదయం కలిగించడమే అయితే ఇంతకుమించిన గొప్ప సాహిత్యం మరొకటిలేదు. అప్పుడే రేకులు విప్పిన ఎర్రతామరపూవులోని లాలిత్యంలో, ఊపిరిసోకితేనే కందిపోతుందేమోననేటంత సౌకుమార్యంలో ముంచి తీసిన గీతమిది.

కోనేటిరాయుడు

కామించి కోరితే కరుణ కురిపించిన కరుణాసముద్రుడు కాబట్టే ఆయన్ని అన్నమయ్య కోనేటి రాయుడని పిలిచి ఉంటాడు. అదీకాక కొండలరాయడు అనడం స్వభావోక్తి. కొండలలో నెలకొన్న కోనేటిరాయడం అనడంలోనే కదా కవిత్వముంది!

శ్రీవేంగడం

ఒకసారి శ్రీవేంకటనాథుడు తెలుగు కవుల్ని ఆకర్షించడం మొదలుపెట్టాక అన్నమయ్య వంటి మహాభక్తుడూ, శ్రీకృష్ణదేవరాయల వంటి చక్రవర్తి మాత్రమే కాదు, మరెందరో కవులు తుమ్మెదలై ఆ పద్మనాభుడి చుట్టూ పరిభ్రమిస్తూనే ఉన్నారు.