ఇక్కడ అనేక శతాబ్దాలుగా అసంఖ్యాకమానవులు తమ జీవితాలను ప్రార్థనాగీతాలుగా, హారతిజ్యోతులుగా మార్చేసుకున్నారు. ఏ అతీతకాలంలో పరమశివుడు పార్వతీదేవి చెవిలో ఏ రహస్యసంభాషణ చేశాడోగాని ఆ రహస్యాన్ని ప్రజాస్వామికం చేయడం కోసమే జ్ఞానేశ్వరుడినుంచి సాయినాథుడిదాకా ఒక ఆధ్యాత్మిక ఉద్యమం కొనసాగుతూ వస్తోందనిపించింది.
అవధూత గీత-5
బహుశా, బాహ్యశాసనాలనుంచీ, నియమనిబంధనలనుంచీ మాత్రమే కాక, అంతరంగపు ఆరాటాలనుంచీ, సూక్ష్మ, అతిసూక్ష్మ ప్రలోభాలనుంచీ బయటపడినవాడు మాత్రమే అవధూత గీతలాంటి గీతాన్ని పలకగలుగుతాడు.
