మెడిటేషన్స్-2

ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక చక్రవర్తి తన రాజ్యాన్ని రక్షించడం కోసం యుద్ధాలు చేస్తూ, ఆ యుద్ధభూమిలో ఎత్తైన కొండమీద దుర్గాన్ని నిర్మించుకున్నట్టుగా, తన అంతరంగ యుద్ధంలో తనని తాను కాపాడుకోడానికి మరొక దుర్గాన్ని నిర్మించుకున్నాడని తెలిస్తే చాలా ఆశ్చర్యమనిపిస్తుంది.