మనం కలుసుకున్న సమయాలు-3

అసిసీకి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్, వారణాసికి చెందిన కబీరు, మన కాలంలో గాంధీ మాట్లాడింది ఆ ఐచ్ఛిక దారిద్య్రం గురించే. నాకు తెలిసి, నేను చూసిన వాళ్ళల్లో అంత ఐచ్ఛికంగా వస్తుసంచయాన్ని నిరాకరించిన ఉదాహరణలు జయతి, లోహి తప్ప మరొకరు లేరు.