
ఐ.వై.ఆర్ రామకృష్ణరావుగారు 1979 బాచికి చెందిన ఐ.ఏ.ఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్నో ఉన్నతపదవీబాధ్యతలు నిర్వహించారు. తిరుమల తిరుపతిదేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పనిచేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీవిరమణ చేసారు. గత కొంతకాలంగా ఆయన ఐవైఆర్ టాక్స్ పేరిట ఒక యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. అందులో రాజకీయ, సామాజిక, సాహిత్య రంగాల్లో విశేషకృషి చేసినవారితో సంభాషణలు చేసి తన వీక్షకుల్తో పంచుకుంటున్నారు. దానిలో భాగంగా కిందటినెలలో నాతో జరిపిన సంభాషణను నిన్న తన ఛానెల్లో విడుదలచేసారు. నేను ఇటీవల వెలువరించిన ‘తెలుగదేలయన్న’ పుస్తకం పైన ప్రధానంగా చర్చ నడిచింది. ఆసక్తి ఉన్న మిత్రులు వింటారని ఇక్కడ ఆ ఇంటర్వ్యూ పొందుపరుస్తున్నాను.
3-8-2026


తెలుగు భాష పరిణామాన్ని శాసనభాష, సాహిత్యభాష, ఆధునిక భాష, ప్రపంచ భాష అనే నాలుగు దశల్లో విశ్లేషించిన విధానం చాలా interesting and informative గా వుంది.
శాసన భాష నుండి సాహిత్య భాషగా తెలుగు ఎందుకు, ఎలా పరిణామం చెందిందనే Socio-political reasonsని వివరించిన విధానం,
ఆధునిక కాలంలో భాష modernization వల్ల అక్షరాస్యత పెరగడం, విజ్ఞాన వ్యాప్తికి మార్గం ఏర్పడటం, ఈ దిశగా కృషి చేసిన మహానుభావులను తలుచుకోవడం,
ఇక ప్రపంచ భాషగా ఎదగాలంటే తెలుగు నుంచి ఇతర భాషల్లోకి, ఇతర భాషల నుంచి తెలుగులోకి అనువాదాలు, knowledge exchange, మరింత విస్తరించాల్సిన అవసరాన్ని గురించిన చర్చ చాలా ఆలోచింపజేసింది సర్.
A very important conversation!!
Thank you, Sir. 🙏🏽
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!