తన ధ్యాసంతా

అజ్ఞాత వాసంలో ఉన్న చిత్రకారుడెవరో తన తైలవర్ణాలిక్కడ దాచుకున్నట్టుగా కొంత పసుపు, కొంత తెలుపు, కొంత రక్తం ముద్దగా మూటగట్టుకున్నట్టు ఒక మొగ్గ.

ఎన్.హెచ్.44-2

ఆ నల్లటి తారురోడ్డుమీద వేలాది పాదాలు నిర్విరామంగా నడుస్తూనే ఉన్నాయి. కృష్ణారావుగారు లక్షబొటిమనవేళ్ళు చూసానని చెప్పుకున్నాడు. ఆయన చేతిబొటమ వేళ్ళు చూసాడు. గంగారెడ్డి కాలిబొటమనవేళ్ళు చూస్తున్నాడు. కూలీలవి, దిక్కులేని, వృద్ధులవి, పిల్లలవి, గర్భిణీస్త్రీలవి- నడిచి నడిచి, ఇంకా ఎంత దూరం నడవాలో తెలియక రాళ్ళల్లాగా మారిపోయిన కాళ్ళబొటమనవేళ్ళు చూస్తున్నాడు.

ఎన్.హెచ్.44 -1

'వాడ్రేవు చిన వీరభద్రుడు కథలు 1980-2023' సంపుటి ఎమెస్కో బుక్స్, విజయవాడ వారిదగ్గర లభ్యమవుతుంది. కావలసినవారు emescovja@gmail.com, sahiti.vja@gmail.com, http://www.emescobooks.com లేదా 0866-2436643 ను గాని సంప్రదించవచ్చు. పుటలు 504+4, వెల రు. 300