ఆ వెన్నెల రాత్రులు-4

మొక్కల్తో మాట్లాడవచ్చుననే నాకెవరూ ఇప్పటిదాకా చెప్పలేదు. ఆ ఊహనే ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించింది. నేను అప్రయత్నంగా నా చుట్టూ చూసాను. అక్కడ కొండచుట్టూ, కొండమీదా పెరిగిన తరులతాగుల్మాదులన్నీ నాతో మాట్లాడటానికి నా చుట్టూ మూగుతున్నట్టనిపించింది.