ఎవరో ఒకరు ఏదో ఒక కాలంలో

కాని నాకై  నేను ఇప్పుడు కొత్తగా తెలుసుకుంటున్నదేమంటే, ఒక  కృష్ణశాస్త్రి వెనక, ఒక ఇస్మాయిల్ వెనక, సుదూరకాలాలకు చెందిన ప్రాచీన గ్రీకు లిరిక్ కవులు కూడా ఉన్నారని.

భూమ్మీద మొలకెత్తిన నక్షత్రాలు

చెట్ల మీద మన దగ్గర ఏవైనా కవితా సంకనాలు వచ్చాయా? చెట్ల మీదనే ఎవరైనా కవి మొత్తం కవితలతో ఒక కవితల సంపుటి ఏదైనా వెలువరించాడా? చెట్లకు ఎవరైనా ఉత్తరాలు రాసారా?

నూరువిధాలుగా నేలని ముద్దాడచ్చు

నేను ప్రతిరోజూ ఈ రెండు పనులూ చేస్తాను. లేవగానే మంచం దిగగానే ముందు నేలమీద మోకరిల్లుతాను. రాత్రి పడుకోబోయేముందు మరొకసారి మోకరిల్లుతాను. అలా రెండు సార్లు మోకరిల్లగలిగిన ప్రతి రోజూ నాకు నా జీవితం సంపూర్ణంగా జీవించాననే అనుభూతితోనే నిద్రకి ఉపక్రమిస్తాను.