ఈ లోకంలో నేను కూరుకుపోకుండా, ఇక్కడి శక్తులకీ, వస్తువులకీ బానిసని కాకుండా ఉండగలిగానంటే, ఈ సముద్రం ఒడ్డున ఒక పడవలాగా ఆ శ్లోకసారాంశం నా మనసులో నిలిచిపోవడమే కారణమనుకుంటాను.
సుజాత
ఊరిపొలిమేరల్లో వెలిసిన అమ్మవారి కోవెల్లో వెలిగే మట్టిప్రమిదలో దీపం ఆమె.
వనవాసిని-2
కాని తమ జీవితానుభవాల్ని మనతో పంచుకోవడంలో ఒక జయతి, ఒక వీణావాణి చూపిస్తున్న authenticity అద్వితీయమనిపిస్తుంది. ఎందుకంటే వారు సిద్ధాంతాలమీదగానో, లేదా సాంఘిక విమర్శదారిలోనో కాక, చిన్న చిన్న నిశ్శబ్దాలమీంచీ, పచ్చని చెట్లదారుల్లోంచీ జీవితసాఫల్యాన్ని వెతుక్కుంటున్నారనిపిస్తుంది.
