ఇందులోని ఖాళీలతో సహా ఇదొక ఉత్సవ గీతం. కాలం కబళించిన ఆ అక్షరాలూ, ఆ పదాలూ ఏవైనా గానీ, ఆ ఖాళీజాగాలతో సహా, మొత్తం గీతమంతా ఒక ఉత్సవ సంరంభం. ఇది స్పష్టంగా ఒక epithalamium. ..
ప్రియమైన శాఫో-7
ఇప్పుడు నా ముందున్నవి నీ కవిత్వ శకలాలు. చిన్ని చిన్ని తునకలు. అయితేనేం, వాటితోనే నిన్ను నా మనసులో రూపుకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాను. వాటిలో ఏ ఒక్కదాన్ని తీసుకున్నా చుట్టూ అంతులేని ఖాళీ. ముందూ వెనకా పేజీలు చిరిగిపోయిన ఒక జీవితకథ.
శాఫోకి ఉత్తరాలు
రేపటినుంచీ ఆమెకి పోస్టు చేయబోతున్న ఉత్తరాలు మీవి కూడా అని అనుకుంటున్నాను. అందుకని co-correspondents గా మిమ్మల్ని కూడా ఈ epistolary conversation కి ఆహ్వానిస్తున్నాను.
