నా ఇంటర్మీడియేటు రోజులు

సాగర్ జీవితం నాలో కలిగించిన మరొక కలవరం, సాధారణంగా ఆ వయసు కలిగించే కలవరం. పదహారు, పదిహేడేళ్ళ అడాలసెంటు పిల్లవాడి మనసు చాలా లేతగా ఉంటుంది. ఎవరితోనైనా స్నేహం చెయ్యాలనిపిస్తుంది, ఎవరినైనా ప్రేమించాలనిపిస్తుంది. ప్రేమించినవాళ్ళకోసం ఏమైనా చెయ్యాలనిపిస్తుంది.