
నీటిరంగుల చిత్రం నా ఐదవ కవితా సంపుటి. 2009-2014 మధ్యకాలంలో రాసిన 184 కవితల సంపుటి అది. ఆ అయిదేళ్ళూ నేను కవిత్వ నిర్మాణం పట్ల చాలా శ్రద్ధ చూపించి, తీవ్ర సాధన చేసాను. ఆ విశేషాలన్నింటినీ కొర్రపాటి ఆదిత్యకీ నాకూ మధ్య జరిగిన సంభాషణలో నేను వివరంగా ప్రస్తావించేను. ఆ ఇంటర్వ్యూ కూడా ఆ పుస్తకంలో పొందుపరిచాను.
ఇప్పుడు అందులోంచి 62 కవితల్ని ఇంగ్లిషులోకి అనువదించాను. గత రెండు నెలలుగా నా తీరికసమయాలన్నీ ఆ తెలుగు కవిత్వంలోని శిల్పసౌష్టవాన్ని ఇంగ్లిషులోకి తేవడమెలా అన్నదానిమీదనే కృషి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ ఇంగ్లిషు అనువాదాల్ని ఇలా The Secret Hieroglyph పేరిట మీతో ఇలా పంచుకుంటున్నాను.
ఇది మీకు నా దీపావళి కానుక. దీన్నిక్కడ నుంచి డౌనులోడు చేసుకోవచ్చు.
దీన్ని మా రాజీకి, శ్రీధర్ కి అంకితమిస్తున్నాను. ఇది నా 83 వ పుస్తకం.
ఇందులోంచి ఒక కవిత, అనువాదంతో సహా:
రహస్య చిత్రలిపి
ఏమైతేనేం, వసంతం అడుగుపెట్టింది,
కుదురుకుంది. నిశ్చింతగా కోకిల
ఈ మధ్యాహ్నం ఎక్కడనో నిద్రపోతోంది.
రోడ్లతో, బ్రిడ్జిలతో, భవనాలతో
కిక్కిరిసిన ఈ నగరం మధ్య
ఒక ప్రాచీనదేశాన్ని గుర్తుపడుతున్నాను.
ఈ వేళలు కుమ్మరిస్తున్న వెలుతురులో
నా దగ్గరున్న రహస్యచిత్రలిపి
కొద్దికొద్దిగా గుర్తుపట్టాను.
పోల్చుకున్న కొండగుర్తులు ఆసరాగా,
ఎవరికీ అక్కర్లేని విస్మృతనిధికోసం
నేనొక్కణ్ణే సాహసయాత్ర మొదలుపెట్టాను.
The Secret Hieroglyph
At last, spring has stepped in
and settled. Somewhere in the afternoon heat,
the koel sleeps without a care.
Hemmed in by roads, bridges, and towers,
in the dense belly of this crowded city,
I begin to trace an ancient land.
In the light poured out by these passing hours,
I begin to decipher, sign by sign,
the secret hieroglyph close to my heart.
Guided by waypoints matched and mapped,
for a forgotten gold no one cares to seek,
I set out on this perilous quest—
alone and adrift.
30-10-2026


Fantastic sir…thank you veryvery much .. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు ❤️
హృదయపూర్వక ధన్యవాదాలు మానసా!
🧑🏻🎄 Santa Claus ( కన్న తల్లిదండ్రులు ) కూడా ఇన్ని అమూల్యమైన బహుమతులు ఇచ్చి ఉండరు!🫡 Sir మీ ఉదారతకు..
హృదయపూర్వక నమస్కారాలు సార్!