గురూజీ పుట్టినరోజు

శనివారం అదిలాబాద్ చేరుకునేటప్పటికి మధ్యాహ్నమైపోయింది. మేము మా లగేజి గెస్ట్ హవుసులో పెట్టి తొందర తొందరగా తయారై కళాశ్రమానికి చేరుకునేటప్పటికి అపూర్వ శర్మ మా కోసం ఎదురుచూస్తూఉన్నారు .

2021 ఫిబ్రవరిలో అతని పెళ్ళికి వచ్చిన తరువాత మళ్ళా ఇదే ఆశ్రమానికి రావడం. వానాకాలం కావడంతో ఆశ్రమమంతా పచ్చగా ఉంది. ఎటుచూసినా ఆకుపచ్చని వెలుతురు.  వెదురుపొదలు మరింత ముదురాకుపచ్చవెలుగుతో చుట్టూ స్తంభాలు నిలబెట్టినట్టున్నాయి. సాయంకాలం ఒక సభ చేస్తున్నట్టుగా కాక, ఒక పండగ చేస్తున్నట్టుగా ఆశ్రమమంతా ధగధగలాడుతోంది.

నాతోపాటు శ్రీపాద లిటరరీ వర్క్స్ ప్రచురణ కర్తల బృందం రాజశ్రీ, ఆమె భర్త శ్రీధర్, అమృతా,సౌందర్యా కూడా ఉన్నారు. ఆశ్రమంలో అడుగుపెడుతూనే వారు ‘జీవనశిల్పి’ పుస్తకాలూ, స్వీట్లూ గురూజీ శ్రీమతి చేతుల్లో పెట్టారు. ఇటువంటి ఒక రోజు రాగలదని నేను కలలో కూడా అనుకోలేదు. సంతోషమూ,దిగులూ రెండూ కలిగిన క్షణం. గురూజీ మీద ఒక పుస్తకం రాసి కళాశ్రమానికి అంకింతమివ్వగలనని అనుకోలేదు. భగవంతుడి అనుగ్రహం వల్ల ఇవ్వగలిగాను. కానీ గురూజీ చేతుల్లో పెట్టలేకపోయాను.

అయితే, నిజం చెప్పొద్దూ! నాకు ఆ రోజంతా గురూజీ అక్కడ ఉన్నట్టే ఉంది. ఆయన ఆ తావుల్లో నడయాడుతుంటే ఎంత కళగా ఉంటుందో ఆ రోజూ అలానే ఉంది. ఆయన ఉన్నట్టే తనతో కలిసి భోజనం చేయమంటూ మమ్మల్ని పిలిచినట్టే ఉంది. వేడివేడిగా రొట్టెలు, కూరా, అన్నం, పాయసం- పోక ఆకుల్తో తయారుచేసిన పళ్ళాల్లో వడ్డించారు. ఆ పళ్ళాలు బెల్గాం నుంచిగోపీకృష్ణ పంపించారట. ఆవురావురు మంటూ ఆ విందు ఆరగించి మళ్ళా ఆశ్రమమంతా ఒకసారి కలయదిరిగాం. గురూజీ తయారుచేసిన మట్టి, ఇత్తడి, దారు, కాంస్యలోహ ప్రతిమలు, బొమ్మలు, శిల్పాలు చూసాం. అలానే ఆయన కొలాం పిల్లలతో గీయించిన వర్ణచిత్రాల ప్లేట్లు కూడా చూసాం. గురూజీ ఉన్నప్పుడు ప్రతి ఏటా మట్టివినాయకుల్ని తయారుచేసి వినాయక చవితికి మిత్రుల కుటుంబాలకి కానుకగా ఇచ్చినట్టే, ఈసారి గురూజీ కుమారుడు కూడా మట్టి వినాయక ప్రతిమలు చేసి సిద్ధంగా ఉంచాడు.

అప్పటికే సుమనస్పతి రెడ్డి ప్రార్థనామందిరంలో కూచుని సాయంకాలం మీటింగు ఏ విధంగా జరపాలా అని ప్లాను చేసుకుంటూ ఉన్నారు. ఈ లోపు సర్దార్ హర్ పాల్ సింగ్ వచ్చారు. ఆయన హిందూ పత్రికకి స్థానిక విలేకరి. గురూజీ జీవితంలో ఎందరో మిత్రులు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ హర్ పాల్ సింగ్ మాత్రం ఆశ్రమం చేయి పట్టుకు వదల్లేదు. జీవనశిల్పి పుస్తకం అట్టమీదా, లోపలా ఉన్న గురూజీ ఫొటోలు ఆయన తీసినవే.

చూస్తూండగానే నాలుగయింది. నెమ్మది నెమ్మదిగా మిత్రులు, ఎక్కడెక్కడివారో కళాశ్రమంలో అడుగుపెడుతూ ఉన్నారు. సభ మొదలయ్యేటప్పటికి దాదాపు అరవై డెభ్భై మంది దాకా సభాస్థలానికి చేరుకున్నారు. పూణే నుంచి గురూజీ సోదరి శోభ ముందే వచ్చి ఉన్నారు. మీటింగుకి హాజరుకావడం కోసమే  ఢిల్లీనుంచి వెంకట్ వచ్చారు. హైదరాబాదు నుంచి ప్రత్యేకంగా నిరూప్ రెడ్డి, దుర్గం రవీందర్ వచ్చారు. అదిలాబాద్ ఆలిండియా రేడియో డైరక్టరు రామేశ్వర్, ఆయన సహోద్యోగి లెనిన్ వచ్చారు. గురూజీ తో తొలిరోజుల్లో కలిసి పనిచేసిన శ్రీపాద్, ఆయన శ్రీమతి జ్యోతి వచ్చారు. గిరిజన సంక్షేమశాఖలో సీనియర్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి పదవీవిరమణ జీవితం గడుపుతున్న జార్జి తెనాలి నుంచి వచ్చాడు. తోకల గురవయ్య ఎంతో ప్రేమతో నాగర్ కర్నూలు జిల్లా అప్పాపూర్ చెంచుగూడెం నుంచి వచ్చాడు. గోండు సమాజం నుంచి మొదటిసారిగా వైద్యవిద్య చదివి, జిల్లా వైద్యశాఖాధికారిగా పనిచేసి ప్రస్తుతం రిమ్స్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న డా.తొడసం చందు వచ్చారు. విఠల్ రావు వచ్చారు. గురూజీతో కలిసి ఉపాధ్యాయుడిగా పనిచేసి ఆ తర్వాత రాజకీయాల్లో చేరి రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేసిన రాథోడ్ బాపురావు వచ్చారు.

ప్రసిద్ధ రచయితలు వసంత్ రావ్ దేశ్ పాండే, ఉదారి నారాయణలతో పాటు యువరచయితలు సుమాంజలి,కె.వినయకుమార్, ఎ.వినయ కుమార్ లు, చరిత్రపరిశోధకుడు కమలాకర్ రెడ్డి  కూడా వచ్చారు. గురూజీ పనిచేసిన కొలాం ఆశ్రమపాఠశాలలో చాలాకాలం ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన పాల్దె ప్రసాద్ వచ్చారు. మాణిక్ రావు, విజయ్ బాబు, చిందం ఆశన్న, ఏలియా, సతీష్ దేశ్ పాండే, భూపతి రావు లతో పాటు స్వశోధన్ ట్రస్టు ప్రతినిధులు కూడా వచ్చారు. మిర్యాల గూడ నుంచి ‘మట్టిమనిషి’ వేనేపల్లి పాండురంగారావు వచ్చారు. మరెందరో అతిథులు, నేను పేర్లు ప్రస్తావించ లేకపోతున్నాను,వారంతా కూడా గురూజీ పట్ల ప్రేమతో వచ్చారు.

మొదటగా శ్రీమతి రాజశ్రీ అమ్మ, అపూర్వ శర్మ గురూజీ చిత్రపటం ముందు జ్యోతి వెలిగించారు. పుష్పాంజలి సమర్పించారు. గురూజీ 74 వ పుట్టినరోజుని తలుచుకుంటూ వచ్చిన అతిథులు కూడా తమ దోసిళ్ళతో పూలు చల్లారు. ఆ తర్వాత జీవన శిల్పి పుస్తకాన్ని రాజశ్రీ అమ్మ ఆవిష్కరించారు. వారితోపాటు శ్రీపాద లిటరరీ వర్క్స్ తరఫున రాజశ్రీరావు, శ్రీమతి జ్యోతి కూడా పుస్తకం ఆవిష్కరించారు. మొదటి ప్రతిని అపూర్వశర్మకూ, రెండవ ప్రతిని సర్దార్ హర్ పాల్ సింగ్ లకు అందచేసారు.

ఆ తర్వాత ఆ పుస్తకం రాయడం వెనక ఉన్న నా ఉద్దేశాల గురించీ, గురూజీ ద్వారా నేను తెలుసుకున్న విషయాల గురించీ , గురూజీ గురించి భావితరాలు తెలుసుకోవలసిన విషయాల గురించీ సుమనస్పతి రెడ్డి నాతో ముఖాముఖి నిర్వహించారు. దాదాపు గంటసేపు నడిచిన ఇంటర్వ్యూలో నేను ప్రధానంగా చెప్పింది ఒకటే: అదిలాబాదులో తెలుగు రచయితలు చాలామంది ఉన్నప్పటికీ, వారు గురూజీని సన్నిహితంగా ఎరిగి ఉన్నప్పటికీ, ఇప్పటిదాకా గురూజీ పైన తెలుగులో ఒక్క పుస్తకం కూడా రాకపోవడం ఒక లోటుగా భావిస్తున్నాననీ, ఇప్పుడేనా మిత్రులు ఆయన గురించి రాయడం మొదలుపెట్టాలనీ చెప్పాను. ఉత్తరాదిన గురూజీ ఆలోచనలు ఇప్పటికే ప్రభావశీలంగా పనిచేస్తున్నాయనీ, ఆయన గురించి తెలుగువాళ్ళు ఇంకా తెలుసుకోవలసిన పరిస్థితిలోనే ఉన్నారనీ, ఆ లోటుగా పూరించే దిశగా నేను నా పుస్తకం వెలువరించాననీ చెప్పాను. అలాగే మరో ముఖ్యమైన సంగతి కూడా ప్రస్తావించేను: పుత్రుడు అంటే నరకం నుంచి తప్పించేవాడని మనవాళ్ళు చెప్తారు. గురూజీ వంటి వాడి విషయంలో నరకం అంటే ఆయన ఆశయాల్నీ, ఆలోచనలనీ మనం మర్చిపోవడమే. స్వర్గం అంటే ఆయన చేపట్టిన ప్రయత్నాల్ని ముందుకు కొనసాగించడమే. ఇప్పుడు గురూజీ పుత్రుడు అపూర్వ శర్మ తండ్రి కృషిని కొనసాగిస్తూ ఉండటం గురూజీ చేసుకున్న పుణ్యం అని కూడా చెప్పాను.

ఇంటర్వ్యూ తర్వాత అక్కడ ఉన్న మిత్రులు చాలామంది గురూజీతో తమ జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. బహుశా గురూజీ జీవించి ఉండగా ఆయన తన పుట్టినరోజు ఎప్పుడూ జరుపుకుని ఉండరు. అలాంటిది ఆ రోజు అంతమంది అక్కడ చేరి ఆ వేడుకలో సంతోషంగా పాల్గొని తమ స్మృతుల్ని నెమరేసుకోవడం నాకు ఎంతో ఉజ్జ్వలంగా అనిపించింది. గురూజీ కూడా అక్కడే ఉన్నారనీ వారిమాటలన్నీ చిరునవ్వుతో ఆలకిస్తున్నారనీ అనిపిస్తూ ఉండింది నాకు.

రాథోడ్ బాపురావు ఆ పుస్తకాన్ని హిందీలోకి అనువదిస్తానని చెప్పారు. గురూజీ ఆలిండియా రేడియో, అదిలాబాదు వారికి ఇచ్చిన ఇంటర్వ్యూల్ని తాను పుస్తకాలుగా తీసుకువస్తానని ‘మట్టిమనిషి’ వేనేపల్లిపాండురంగారావు చెప్పారు. నాకు సంతోషమనిపించింది. ఒక దీపం రెండు దీపాల్ని వెలిగించింది. రేపు మరెన్నో దీపాలు వెలుగుతాయని నమ్మకం కలిగింది.

‘జీవనశిల్పి’ పుస్తకం వంద ప్రతుల్ని శ్రీపాద లిటరరీ వర్క్స్ వారు కళాశ్రమానికి సమర్పించారు. సమావేశానికి వచ్చిన అతిథులు దాదాపు పాతికపుస్తకాలు అక్కడికక్కడే కొనుగోలు చేసారు. మరొక ముప్ఫై పుస్తకాల దాకా తనకు ముందే అభ్యర్థనలు వచ్చాయని అపూర్వశర్మ  చెప్పారు .

సభముగిసేటప్పటికి రాత్రి తొమ్మిదయ్యింది. ఆశ్రమం ముంగిట్లో పారిజాతాలు విచ్చుకుంటూ ఉన్నాయి. ఇలాంటి పారిజాతాల రాత్రులు గతంలో గురూజీతో మాట్లాడుతుండగా గడిచినవి గుర్తొచ్చాయి. జాతి గర్వించదగ్గ ఒక మహనీయుడు నాకు తెలుసనీ, నేను ఆయనకు అంతేవాసిగా కొంతకాలమైనా గడిపే భాగ్యానికి నోచుకున్నాననీ అనుకుంటేనే ఎంతో గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. ఇన్నాళ్ళకు ఆ ఋణం కొంతైనా తీర్చుకున్నట్టుగా మనసు తేలికపడింది. రాత్రి మళ్ళా గురూజీ ఇంట్లో విందు, పెళ్ళివారింటిని తలపిస్తూ. ఆ మర్నాడు పొచ్చెర, కుంటాల జలపాతాలు చూసుకుంటూ ఇంటికి వచ్చేటప్పటికి హృదయం  ఒక ఇంద్రచాపంగా మారిపోయింది.


Guruji’s Birthday

By the time we reached Adilabad on Saturday, it was already afternoon. We left our luggage at the guest house, quickly freshened up, and reached Kalashram, where Apurva Sharma was waiting to receive us. It was my first visit to the ashram since February 2021, when I attended his wedding.

Because of the monsoon season, the entire ashram was lush green. A canopy of green light reflected everywhere. The bamboo thickets looked like pillars standing around in deep emerald radiance. Rather than a formal gathering in the evening, the ashram was glowing with the warmth and joy of a festival.

Accompanying me were the publishers from Sripada Literary Works: Rajasri, her husband Sridhar, Amrutha, and Soundarya. As soon as they stepped into the ashram, they placed the copies of the book Jeevana Shilpi along with sweets into the hands of Guruji’s wife. I had never imagined even in my wildest dreams that such a day would arrive. It was a moment filled with both joy and a quiet wistfulness. I never thought I would be able to write a book on Guruji and dedicate it to Kalashram. By the grace of the Almighty, I could present it, though I could not place it directly into Guruji’s hands.

Yet, to tell the truth, I felt Guruji’s living presence there all through the day. The vibrant grace that always filled the air when he walked those grounds was palpable even then. It felt as if he were right there, inviting us to share a meal with him. Warm rotis, curry, rice, and payasam were served on plates crafted from areca palm leaves. We were told that Gopi Krishna had sent those plates from Belgaum. Savoring that hearty meal, we strolled through the entire ashram once again.

We looked at the idols, toys, and sculptures made of clay, brass, wood, and bronze crafted by Guruji. We also saw the plates of colored paintings he had guided the Kolam tribal children to make. Just as Guruji would sculpt clay Ganeshas every year during his lifetime to gift to friends’ families for Vinayaka Chavithi, his son had sculpted and kept clay Ganesha idols ready this time as well.

By then, Sumanaspati Reddy was sitting in the prayer hall, planning how to conduct the evening meeting. Meanwhile, Sardar Harpal Singh arrived. He is the local correspondent for The Hindu newspaper. Many friends came and went in Guruji’s life, but Harpal Singh never let go of the ashram’s hand. The photographs of Guruji featured on the cover and inside the book Jeevana Shilpi were taken by him.

In no time, it was four o’clock. Slowly, friends and well-wishers from various places began arriving at Kalashram. By the time the meeting commenced, nearly sixty to seventy people had gathered at the venue. Guruji’s sister, Shobha, had arrived earlier from Pune. Venkat came all the way from Delhi solely to attend this gathering. From Hyderabad, Niroop Reddy and Durgam Ravinder arrived especially for this occasion. Rameshwar, the Director of All India Radio, Adilabad, arrived with his colleague Lenin. Sripad, who had worked closely with Guruji in the early days, came with his wife, Jyothi. George, who had retired after serving as a senior Headmaster in the Tribal Welfare Department, came from Tenali. Tokala Guravaiah traveled with great affection from the Appapur Chenchu settlement in Nagarkurnool district. Dr. Thodasam Chandu, who was the first from the Gond community to pursue medical education, served as District Medical and Health Officer, and is currently the Superintendent of RIMS, was present. Vithal Rao attended. Rathod Bapurao, who worked alongside Guruji as a teacher and later entered politics to serve twice as a Member of the Legislative Assembly, was present. Renowned writers Vasant Rao Deshpande and Udari Narayana arrived, along with young writers Sumanjali, K. Vinay Kumar, and A. Vinay Kumar, as well as historical researcher Kamalakar Reddy. Palde Prasad, who served for a long time as the Headmaster of the Kolam Ashram School where Guruji taught, was there. Representatives of the Swashodhan Trust arrived along with Manik Rao, Vijay Babu, Chindam Ashanna, Eliya, Satish Deshpande, and Bhupathi Rao. Venepalli Panduranga Rao, known as ‘Matti Manishi’ (Man of the Soil), came from Miryalaguda. Many other guests, whose names I may have omitted, arrived purely out of deep reverence and love for Guruji.

To begin the ceremony, Smt. Rajashree Amma and Apurva Sharma lit the lamp before Guruji’s portrait and offered floral tributes. Commemorating Guruji’s 74th birthday, all the gathered guests offered showers of petals with joined hands. Following this, the book Jeevana Shilpi was formally released by Rajashree Amma. Along with her, Rajasri Rao and Smt. Jyothi unveiled the book on behalf of Sripada Literary Works. The first copy was presented to Apurva Sharma, and the second copy to Sardar Harpal Singh.

Afterwards, Sumanaspati Reddy conducted an interview with me regarding the intent behind writing this book, the insights I gained through Guruji, and what future generations need to understand about him. During the conversation, which lasted nearly an hour, I emphasized one central thought: despite the presence of many Telugu writers in Adilabad who knew Guruji intimately, not a single book had been published on him in Telugu until now, which I viewed as a profound void. I urged that friends and scholars begin writing about him at least now. I noted that Guruji’s ideas are already exercising a profound influence across North India, while the Telugu community is yet to fully understand his depth, and that I brought out this book precisely to help bridge that gap. I also touched upon another significant point: our tradition says a son (putra) is one who delivers his ancestors from sorrow (naraka). In the case of someone like Guruji, true sorrow would mean letting his ideals and vision fade from memory. True fulfillment lies in carrying forward the work he initiated. Guruji is truly blessed that his son, Apurva Sharma, is dedicating himself to sustaining his father’s lifelong mission.

Following the conversation, many friends present shared their personal reminiscences of Guruji. Guruji had probably never celebrated his birthday during his lifetime. Seeing so many people gather with such joy to celebrate his memory felt profoundly radiant. Throughout the evening, I could sense Guruji standing right among us, listening to every word with his characteristic gentle smile.

Rathod Bapurao announced that he would translate the book into Hindi. Venepalli Panduranga Rao, ‘Matti Manishi’, came forward to state that he would bring out Guruji’s interviews with All India Radio, Adilabad, in book form. My heart was gladdened. One lamp had lit two more. I felt an abiding faith that many more lamps would be kindled tomorrow.

Sripada Literary Works presented one hundred copies of Jeevana Shilpi to Kalashram. The guests who attended purchased nearly twenty-five copies on the spot. Apurva Sharma mentioned that he had already received advance requests for about thirty copies.

By the time the gathering concluded, it was nine in the night. In the courtyard of the ashram, night-flowering parijata blossoms were opening their petals. It brought back memories of fragrant parijata nights spent in deep conversation with Guruji years ago. A deep sense of quiet honor fills my being knowing that I had the privilege of knowing a towering figure of whom the nation can be proud, and of walking beside him as a disciple for a part of my journey. My heart felt lightened, as if a part of that long-standing debt had finally been fulfilled. That night, there was a feast once again at Guruji’s home, reminiscent of a festive wedding household. The next day, after visiting the Pochera and Kuntala waterfalls on the journey back home, my heart felt arched across the horizon like a radiant rainbow.


गुरुजी का जन्मदिवस

शनिवार को जब हम आदिलाबाद पहुँचे, तब तक दोपहर हो चुकी थी। हमने अपना सामान गेस्ट हाउस में रखा और जल्दी-जल्दी तैयार होकर जब कलाश्रम पहुँचे, तो अपूर्व शर्मा हमारा इंतज़ार कर रहे थे। फ़रवरी 2021 में उनके विवाह में शामिल होने के बाद, इतने समय बाद मेरा पुनः इस आश्रम में आना हुआ।

बरसात का मौसम होने के कारण पूरा आश्रम हरियाली से सराबोर था। जिधर भी दृष्टि जाती, एक हरी आभा फैली हुई थी। बाँस के झुरमुट गहरी हरी रोशनी के साथ मानो चारों ओर स्तंभ बनकर खड़े थे। ऐसा प्रतीत हो रहा था जैसे शाम को कोई औपचारिक सभा न होकर कोई पावन उत्सव मनाया जा रहा हो; पूरा आश्रम एक अनोखी आभा से दमक रहा था।

मेरे साथ ‘श्रीपाद लिटरेरी वर्क्स’ की प्रकाशक राजश्री, उनके पति श्रीधर, अमृता और सौंदर्या भी उपस्थित थीं। आश्रम में प्रवेश करते ही उन्होंने ‘जीवन शिल्पी’ की पुस्तकें और मिष्ठान्न गुरुजी की धर्मपत्नी के हाथों में सौंपे। मैंने सपने में भी नहीं सोचा था कि कभी ऐसा दिन देखने को मिलेगा। यह क्षण असीम आनंद और अव्यक्त भावुकता से भरा हुआ था। मैंने कभी नहीं सोचा था कि मैं गुरुजी पर एक पूरी पुस्तक लिखकर कलाश्रम को समर्पित कर पाऊँगा। ईश्वर की अहैतुकी कृपा से यह संभव हुआ, यद्यपि इस कृति को मैं स्वयं गुरुजी के हाथों में नहीं सौंप सका।

परंतु सच कहूँ तो, मुझे पूरे दिन ऐसा आभास होता रहा मानो गुरुजी वहीं उपस्थित हों। जब वे इस परिसर में विचरण करते थे, तब यहाँ जैसी सजीवता और गरिमा होती थी, उस दिन भी ठीक वैसा ही वातावरण था। ऐसा लगा मानो वे स्वयं साक्षात खड़े होकर हमें अपने साथ भोजन करने के लिए पुकार रहे हों। सुपारी के पत्तों (अरेका लीफ़) से बनी थालियों में गरमा-गरम रोटियाँ, सब्ज़ी, चावल और खीर परोसी गई। बताया गया कि वे थालियाँ बेलगाम से गोपीकृष्ण ने भेजी थीं। तृप्तिपूर्वक उस सात्विक दावत का आनंद लेने के पश्चात, हमने एक बार पुनः पूरे आश्रम का भ्रमण किया।

हमने गुरुजी द्वारा निर्मित मिट्टी, पीतल, काष्ठ और काँसे की प्रतिमाएँ, खिलौने और शिल्पकलाएँ देखीं। साथ ही कोलाम जनजाति के बच्चों द्वारा बनाए गए रंगीन चित्रों की पट्टिकाएँ भी देखीं। जैसे गुरुजी के जीवनकाल में वे हर वर्ष विनायक चतुर्थी पर मिट्टी के गणेश बनाकर मित्र परिवारों को उपहार स्वरूप दिया करते थे, इस बार भी गुरुजी के सुपुत्र ने मिट्टी की गणेश प्रतिमाएँ स्वयं तैयार करके रखी हुई थीं।

उस समय सुमनस्पति रेड्डी प्रार्थना भवन में बैठकर शाम की गोष्ठी की रूपरेखा तैयार कर रहे थे। इसी बीच सरदार हरपाल सिंह आ पहुँचे। वे ‘द हिंदू’ समाचार-पत्र के स्थानीय संवाददाता हैं। गुरुजी के जीवन में अनेक मित्र आए और गए, परंतु हरपाल सिंह ने आश्रम का साथ कभी नहीं छोड़ा। ‘जीवन शिल्पी’ पुस्तक के मुखपृष्ठ और भीतर प्रकाशित गुरुजी के चित्र उन्हीं के द्वारा खींचे गए हैं

देखते-ही-देखते चार बज गए। धीरे-धीरे दूर-दराज से आए मित्रगण कलाश्रम में एकत्र होने लगे। सभा आरंभ होने तक लगभग साठ-सत्तर लोग सभागार में उपस्थित हो चुके थे। पुणे से गुरुजी की बहन शोभा पहले ही पहुँच चुकी थीं। केवल इस सभा में सम्मिलित होने के लिए वेंकट दिल्ली से आए थे। हैदराबाद से विशेष रूप से निरूप रेड्डी और दुर्गम रवींद्र पहुँचे। आदिलाबाद आकाशवाणी केंद्र के निदेशक रामेश्वर और उनके सहकर्मी लेनिन आए। गुरुजी के साथ प्रारंभिक दिनों में कार्य कर चुके श्रीपाद और उनकी धर्मपत्नी ज्योति पहुँचे। जनजातीय कल्याण विभाग में वरिष्ठ प्रधानाध्यापक के पद से सेवानिवृत्त जॉर्ज तेनाली से आए। तोकला गुरवय्या बड़े प्रेम से नागरकर्नूल ज़िले के अप्पापुर चेंचुगुडेम से आए। गोंड समुदाय से प्रथम बार चिकित्सा शिक्षा प्राप्त कर, ज़िला चिकित्सा अधिकारी रहे और वर्तमान में ‘रिम्स’ (RIMS) के अधीक्षक डॉ. थोडसम चंदू उपस्थित हुए। विट्ठल राव आए। गुरुजी के साथ शिक्षक के रूप में कार्य कर, बाद में राजनीति में प्रवेश करके दो बार विधायक रहे राठौड़ बापूराव उपस्थित हुए। प्रसिद्ध लेखक वसंत राव देशपांडे और उदारे नारायण के साथ युवा लेखक सुमांजली, के. विनय कुमार, ए. विनय कुमार तथा इतिहास-शोधकर्ता कमलाकर रेड्डी भी आए। गुरुजी ने जिस कोलाम आश्रम विद्यालय में अध्यापन किया था, वहाँ दीर्घकाल तक प्रधानाध्यापक रहे पाल्दे प्रसाद भी पहुँचे। विजय बाबू, चिंदम आशन्ना, एलिया, सतीश देशपांडे, भूपति राव, माणिक राव के साथ ‘स्वशोधन ट्रस्ट’ के प्रतिनिधि भी उपस्थित हुए। मिर्यालगुडा से ‘मट्टी मनिषि’ (माटी के मानव) वेनेपल्ली पांडुरंगाराव आए।और भी कई गणमान्य अतिथि, जिनके नाम यहाँ छूट रहे हों, वे सभी केवल और केवल गुरुजी के प्रति अपने अगाध स्नेह के कारण वहाँ खिंचे चले आए थे।

सर्वप्रथम श्रीमती राजश्री अम्मा और अपूर्व शर्मा ने गुरुजी के तैलचित्र के समक्ष दीप प्रज्वलित किया और पुष्पांजलि अर्पित की। गुरुजी के 74वें जन्मदिवस का स्मरण करते हुए उपस्थित सभी अतिथियों ने भी अंजलि भरकर पुष्प अर्पित किए। तत्पश्चात ‘जीवन शिल्पी’ पुस्तक का विमोचन राजश्री अम्मा द्वारा किया गया। उनके साथ ‘श्रीपाद लिटरेरी वर्क्स’ की ओर से राजश्री राव और श्रीमती ज्योति ने भी पुस्तक का लोकार्पण किया। प्रथम प्रति अपूर्व शर्मा को और द्वितीय प्रति सरदार हरपाल सिंह को भेंट की गई।

इसके बाद, इस पुस्तक के लेखन का मूल उद्देश्य, गुरुजी के सान्निध्य से मुझे प्राप्त अंतर्दृष्टियाँ और आने वाली पीढ़ियों को गुरुजी के विचारों से क्या सीखना चाहिए—इन विषयों पर सुमनस्पति रेड्डी ने मेरे साथ एक साक्षात्कार का संचालन किया। लगभग एक घंटे तक चले इस संवाद में मैंने मुख्य रूप से एक ही बात कही: आदिलाबाद में अनेक तेलुगु लेखक होने और गुरुजी को अत्यंत निकटता से जानने के बावजूद, अब तक तेलुगु भाषा में उन पर एक भी पुस्तक न लिखा जाना एक बहुत बड़ा अभाव था; कम से कम अब तो मित्रों को उन पर लिखना आरंभ करना चाहिए। मैंने कहा कि उत्तर भारत में गुरुजी के विचार पहले से ही अत्यंत प्रभावशाली ढंग से कार्य कर रहे हैं, जबकि तेलुगु भाषी समाज अभी भी उनके मूल चिंतन को समझने की आरंभिक प्रक्रिया में ही है; इस रिक्तता को भरने के विनम्र प्रयास के रूप में ही मैंने यह पुस्तक प्रस्तुत की है। साथ ही मैंने एक और महत्वपूर्ण विचार साझा किया: हमारी परंपरा कहती है कि ‘पुत्र’ वह है जो नरक से तार दे। गुरुजी जैसे मनीषी के संदर्भ में ‘नरक’ का अर्थ उनके पावन आदर्शों और विचारों को बिसरा देना है। ‘स्वर्ग’ का अर्थ उनके द्वारा आरंभ किए गए जीवन-यज्ञ को आगे बढ़ाना है। आज गुरुजी के सुपुत्र अपूर्व शर्मा जिस निष्ठा से अपने पिता के कार्य को आगे बढ़ा रहे हैं, वह गुरुजी के ही संचित पुण्यों का सुफल है

साक्षात्कार के उपरांत उपस्थित कई मित्रों ने गुरुजी से जुड़ी अपनी मधुर स्मृतियाँ साझा कीं। गुरुजी ने अपने जीवनकाल में कदाचित् कभी अपना जन्मदिवस नहीं मनाया होगा। ऐसे में, उस दिन इतने सारे लोगों का वहाँ एकत्र होकर हर्षोल्लास के साथ उनके संस्मरणों को याद करना मुझे अत्यंत दिव्य और ज्योतिर्मय प्रतीत हुआ। मुझे निरंतर यही आभास हो रहा था कि गुरुजी भी वहीं सूक्ष्म रूप से उपस्थित होकर सबकी बातें मंद मुस्कान के साथ सुन रहे हैं।

राठौड़ बापूराव ने इस पुस्तक का हिंदी में अनुवाद करने का संकल्प व्यक्त किया। ‘मट्टी मनिषि’ वेनेपल्ली पांडुरंगाराव ने घोषणा की कि वे आदिलाबाद आकाशवाणी को दिए गए गुरुजी के साक्षात्कारों को पुस्तक रूप में प्रकाशित करेंगे। मेरा हृदय अपार संतोष से भर गया। एक दीप ने दो और दीप प्रज्वलित कर दिए थे। मुझे दृढ़ विश्वास हो गया कि आने वाले कल में ऐसे अनगिनत दीप जगमगाएँगे।

‘श्रीपाद लिटरेरी वर्क्स’ ने ‘जीवन शिल्पी’ की एक सौ प्रतियाँ कलाश्रम को भेंट कीं। सभा में पधारे अतिथियों ने लगभग पच्चीस प्रतियाँ वहीं तुरंत खरीद लीं। अपूर्व शर्मा ने बताया कि लगभग तीस प्रतियों की अग्रिम माँग उनके पास पहले से आ चुकी थी।

गोष्ठी समाप्त होते-होते रात के नौ बज चुके थे। आश्रम के प्रांगण में पारिजात के श्वेत-नारंगी पुष्प अपनी पंखुड़ियाँ बिखेर रहे थे। उस भीनी सुगंध ने मुझे गुरुजी के साथ बिताई उन पुरानी पारिजात-सुवासित रातों की याद दिला दी। इस बात का स्मरण करके ही हृदय कृतज्ञता और गौरव से भर उठता है कि राष्ट्र जिस विभूति पर गर्व कर सके, मैं उन्हें जान सका और उनके चरणों में बैठकर एक अंतेवासी के रूप में जीवन का कुछ काल बिताने का सौभाग्य मुझे प्राप्त हुआ। वर्षों बाद उस ऋण का एक अंश चुका पाने के बोध से मन हल्का और शांत हो गया। रात को एक बार फिर गुरुजी के घर पर दावत का आयोजन हुआ, जो किसी विवाह वाले घर की रौनक और चहल-पहल की याद दिला रहा था। अगले दिन पोचेरा और कुंतला के जलप्रपातों के सौंदर्य का दर्शन करते हुए जब मैं घर लौटा, तो मेरा अंतरंग एक सतरंगी इंद्रधनुष की भाँति खिल उठा था।

9-9-2026

4 Replies to “గురూజీ పుట్టినరోజు”

  1. గురూజీ పుట్టినరోజున జరిగిన జీవనశిల్పి పుస్తకావిష్కరణ మీటింగ్ విశేషాలు తెలుసుకోవడం సంతోషం.

    శ్రీపాద ప్రచురణలు పంపిన జీవనశిల్పి పుస్తకం మొన్ననే చేరింది.

  2. జీవనశిల్పి పుస్తకాన్ని గురూజీ పుట్టినరోజు సందర్భంగా వారు స్థాపించిన కళాశ్రమానికి అంకితం చేసి, అక్కడే వారి కుటుంబం చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది, సర్.
    ఈ పుస్తకం ద్వారా (మీరు blog posts‌గా రాస్తున్నప్పుడు ) గురూజీ గారి గురించి తెలుసుకోవడం నా అదృష్టం.
    Very happy to know that this work will be translated into Hindi.
    🙏🏽

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading