బహుశా గురూజీ జీవించి ఉండగా ఆయన తన పుట్టినరోజు ఎప్పుడూ జరుపుకుని ఉండరు. అలాంటిది ఆ రోజు అంతమంది అక్కడ చేరి ఆ వేడుకలో సంతోషంగా పాల్గొని తమ స్మృతుల్ని నెమరేసుకోవడం నాకు ఎంతో ఉజ్జ్వలంగా అనిపించింది. గురూజీ కూడా అక్కడే ఉన్నారనీ వారిమాటలన్నీ చిరునవ్వుతో ఆలకిస్తున్నారనీ అనిపిస్తూ ఉండింది నాకు.
జీవనశిల్పి ఆవిష్కరణ
రవీంద్రకుమార శర్మ గారితో 2010 లో నేను చేసిన సంభాషణల్ని జీవనశిల్పి పేరిట మీతో పంచుకున్నాను. ఆ సంభాషణల్ని పుస్తక రూపంగా కూడా ఈ-బుక్ గా మీతో పంచుకున్నాను. శ్రీపాద లిటరరీ వర్క్స్ వారు ఆ సంభాషణల్ని పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ఈ రోజు సాయంకాలం అదిలాబాదులో కళాశ్రమంలో ఆ పుస్తకాన్ని గురూజీ శ్రీమతి రాజశ్రీ శర్మగారు ఆవిష్కరిస్తున్నారు.
కొన్ని కలలు కొన్ని మెలకువలు-25
ఏకోపాధ్యాయపాఠశాలల్లో కృత్యాధార విద్యనీ, ఆశ్రమపాఠశాలల్లో కరికులం సంస్కరణల్నీ మేం ప్రవేశపెట్టామనుకునేకంటే యాభయ్యేళ్ల గిరిజన చరిత్రలో అప్పటికి అటువంటి సంస్కరణల అవసరం మరొకసారి కావలసివచ్చిందనుకోవడం సముచిత మనిపిస్తుంది.
