రిల్క: బుద్ధుడు

అందులో అనుభూతికన్నా, అభిప్రాయప్రకటనకన్నా, పదచిత్రాలకన్నా భిన్నమైందేదో కనిపించింది. ఎంత ప్రయత్నించీ అదేమిటో బోధపరుచుకోలేకపోయాను. ఆ కవితను ఈ నలభయ్యేళ్ళలో వందసార్లేనా చదివి ఉంటాను. కాని ఎప్పటికప్పుడు అది నాకు అందుతూనే అందకుండా జారిపోయేది.