తలపుల్ని తలపులతోటే శుభ్రం చెయ్యాలి

ఆనందం, ధైర్యం, విశ్వాసం కొరియర్లో ఇంటికి వచ్చేవి కావు. తెల్లవారిలేచి చూస్తే అడుగడుగునా, అనుక్షణం అవి మనమీద ధారాళంగా వర్షిస్తూనే ఉన్నాయి. ఉన్నాయి కాబట్టే మనమింకా నిశ్చింతగా మన హృదయావేదనని అక్షరాల్లో పెట్టగలుగుతున్నాం.