కొండాపూర్ లో ఒక మధ్యాహ్నం

కాని, ఇక్కడి పరిస్థితి చూడండి. ఇప్పటికి రెండువేల ఏళ్ళకిందట తెలంగాణాలో ఒక పట్టణం ప్రముఖ్య వ్యాపార కేంద్రంగా విలసిల్లింది. రోమ్ తో సాతవాహనులు నడిపిన వ్యాపారం లో ఆ పట్టణం ఎంత ప్రముఖ పాత్ర పోషించిందంటే అక్కడ ఒక రోమన్ సెటిల్ మెంట్ నే ఏర్పడిందని చరిత్రకారులు చెప్తున్నారు. కాని ఆ ప్రాంతాన్ని చూడటానికి ఇప్ఫుడెవరికీ ఆసక్తి లేదు.