కాని ఒక మనిషి నిజంగా సాధించవలసిన విజయం తన ఆత్మలో సాధించవలసిన విజయం అనేది అంత సులువుగా అర్థమయ్యే విషయం కాదు. ఒకవేళ అర్థమయినా అత్యధిక సంఖ్యాకులు అంగీకరించగలిగే విషయం కాదు. నిజమైన నాయకుడు తన ఆత్మిక విముక్తికోసం మాత్రమే కాదు, తనని అనుసరించే వాళ్ళ ఆత్మిక విముక్తికోసం కూడా తపిస్తాడన్నమాట ఆ అనుచరులకి అర్థమయ్యే విషయం కానే కాదు.