మన సాహిత్యం, మన సినిమాల్లో ఈ సంఘర్షణ ఏమైనా చిత్రితమవుతూ ఉందా? మన రచయితలూ, మన దర్శకులూ మనల్ని ఉత్తేజపరచగలుగుతున్నారా? - దాదాపుగా ప్రతి రోజూ ఈ ప్రశ్నల మధ్యనే నాకు రోజు తెల్లవారుతుంది. ఏ ఒక్క పుస్తకమేనా, ప్రసంగమేనా, సినిమా, నాటకం, చివరికి ఒక్క సంపాదకీయమేనా నాకు లేశమేనా ధైర్యాన్నివగలదా అని రోజంతా గాలిస్తుంటాను. ఆధునికజీవితం అభయప్రదమని నన్ను నమ్మించగలిగినవాళ్ళు ఒక్కరంటే ఒక్కరేనా ఉన్నారా అని ఆశగా వెతుక్కుంటూ ఉంటాను.