ఆ వెన్నెల రాత్రులు-26

మరేమిటి? జీవితం నీ ఎదట నిల్చొందనీ, రానున్న నీ కాలమంతా ఆ అనుబంధానికే అంకితం కాబోతోందనీ ఏదో స్పష్టాస్పష్టంగా ఉండే ఎరుక. హటాత్తుగా నీ భవిష్యత్తు మీ ఇంటికొచ్చి, మీ వీథి గదిలో కూచుని, 'హలో మిస్' అని పలకరిస్తే, నువ్వు  సోఫా లో కాలుమీద కాలు వేసుకుని కూచుని నిదానంగా మాట్లాడగలవా?