అన్నిటికన్నా ముఖ్యం ఈ ప్రాంతంలో చేపట్టబోయే తవ్వకాల్లో ఒక మానవ శిలాజంగాని లభిస్తే అంతకన్నా గొప్ప అదృష్టం మరొకటి ఉండదు. ఒక తుంటి ఎముకగాని, ఒక పుర్రె గాని కనీసం ఒక దంతం దొరికినా కూడా అది ప్రపంచ మానవ చరిత్రలో భారతదేశానికి గొప్ప గౌరవాన్ని సంపాదించి పెట్టగలదు.