అరుదైన కవి

యూరోప్‌లో ఒకప్పుడు రూబెన్స్‌ అనే చిత్రకారుడు ఉండేవాడు. అతడు స్త్రీల ముఖచిత్రాల్ని చిత్రిస్తున్నప్పుడు ఆ లావణ్యం, ఆ యవ్వనం, ఆ తాజాదనం ఎంత సహజంగా ఉండేవంటే, దాన్ని వర్ణించడానికి మాటలు రాక, కళాప్రశంసకులు, అతడు తన రంగుల్లో ఇంత నెత్తురు కూడా కలుపుతున్నాడా అని ఆశ్చర్యం ప్రకటించారు. మానవదేహాల్లో పొంగులెత్తే ఇంత వేడినెత్తురు కూడా తన అక్షరాల్లో కలిపి సైదాచారి కవిత్వం రాసాడా అని నేను ఆశ్చర్యపోతున్నాను