వరమాలికా ప్రసాదుడు

మునిపల్లె రాజు ఒక శతాబ్ది సమానుడు. తెలుగునేలను ప్రభావితం చేసిన సాహిత్య, సాంఘిక, సాంస్కృతిక ప్రభావాలన్నింటికీ ఆయన వారసుడు. ఆయన రచనలు చదువుతూ ఉంటే మనం ఒక మనిషినో, ఒక కుటుంబాన్నో కాదు, వందేళ్ళ సామాజిక పరివర్తనని దగ్గరనుంచి చూస్తున్నట్టుగా ఉంటుంది.

మునిపల్లె రాజు

కవి, కథకుడు, సాహిత్యారాధకుడు, మహామనిషి మునిపల్లె రాజుగారు మొన్న రాత్రి ఈ లోకాన్ని వదిలివెళ్ళిపోయారు. నిన్న ఆయన పార్థివదేహాన్ని దర్శించుకున్నప్పుడు అస్తిత్వనదపు ఆవలితీరానికి చేరుకున్న ఆ మానవుడు నిశ్చింతగా కనిపించాడు.