నాటకరంగం: నాలుగు ఆలోచనలు

గత నాలుగు రోజులుగా రవీంద్రభారతిలో జరుగుతున్న జాతీయస్థాయి బహుభాషా నాటకోత్సవాల ముగింపు వేడుకలకి నన్ను ముఖ్య అతిథిగా రమ్మని 'అభినయ' శ్రీనివాస్ ఆహ్వానించాడు. 2006 నుంచి ప్రతి ఏటా హైదరాబాదులోనూ, తిరుపతిలోనూ ఒంటిచేతి మీద ఆయన నిర్వహిస్తున్న ఈ వేడుకలు నాటకరరంగానికి గొప్ప ఉపాదానం.