కొన్ని కలలు కొన్ని మెలకువలు-33

ఆయన ఆ మాటలంటున్నప్పుడు ‘ఈజిట్ ఇంప్లిమెంటబుల్’ అని ఐఫాడ్ ఉన్నతాధికారి అడిగిన ప్రశ్న గుర్తొచ్చింది. రామకృష్ణారావు వంటి అంకితభావం కలిగిన వ్యక్తులుంటే, ప్రతి సదాశయానికి ఊపిరులూది ప్రాణం పోసేవారుంటే అటువంటి ప్రణాళికల్ని ఆచరణసాధ్యం మాత్రమే కాదు. వాటినింకా మెరుగపర్చవచ్చునని రామకృష్ణారావు రుజువు చేసారు.

కొన్ని కలలు కొన్ని మెలకువలు-32

అటువంటి ప్రణాళిక ఆదివాసుల విద్య గురించి ప్రపంచంలోనే అంతదాకా రూపొందించబడలేదు. భారతదేశంలో అంత విస్తృతమైన జనసంఖ్యకి అంత సమగ్ర ప్రణాళిక అంతదాకా ఏ ప్రాంతానికీ రూపొందించబడలేదు. ఆ సవివర ప్రణాళిక తమ చేతికందగానే చిన్నపాటి సవరణ కూడా కోరకుండా ఐఫాడ్ యాజమాన్యం దాన్ని యథాతథంగా ఆమోదించింది.

కొన్ని కలలు కొన్ని మెలకువలు -31

ఇది నేను ఊహించని అవకాశం. బహుశా హైదరాబాద్ వచ్చినప్పటినుంచి అంతదాకా నేను చూస్తూ వచ్చిన పాఠశాలలూ, హాజరయిన శిక్షణాశిబిరాలూ, డా.సుజాత ఇచ్చిన అవకాశాలూ, జాయ్‌పుల్‌లెర్నింగ్ కార్యక్రమం అన్నీ నన్నీ ప్రణాళికా రచనకు సంసిద్ధుణ్ణి చేయడానికీ, అందుకు అవసరమైన సామర్ధ్యాన్ని ఇవ్వడానికీ సంభవించిన అవకాశాలే అనిపించింది.