నేను తిరిగిన దారులు-9

పాపికొండల నడుమ

1

భద్రాచలం

శీతాకాలం పొద్దు తెలతెలవారుతోంది. బస్సు భద్రాచలం పొలిమేరల్లో ప్రవేశిస్తోంది. దూరం నుంచి కొండ మీద దీపాలు మిలమిలా మెరుస్తున్నాయి. ‘అనుపమానమై, అతిసుందరమై తనరు చక్రముల ధగధగలాడగ అదిగో భద్రాద్రి, అదిగో గౌతమి’ అనుకోగానే మనసు పులకించిపోయింది.

మేము అమెరికా నుంచి బయలుదేరిన కొన్ని గంటల్లోనే వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన బాంబులు పడ్డాయి. భారతదేశంలో దిగేటప్పటికి మా చుట్టూ అంతా ఆత్రంగా మూగేరు. ఆ క్షణాల్లో సానుభూతి కురిపించినవారే ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పైన బాంబులు కురియడం మొదలు పెట్టగానే మేమేదో తప్పు చేసిన వారిలాగా మమ్మల్ని చూడడం మొదలు పెట్టారు. అమెరికాలో ఉన్నందువల్ల ఆ దేశపు రాజకీయ పరిణామాలన్నిటికీ మేము కూడా బాధ్యులమవుతున్నట్టే ఉంది.  హైదరాబాద్‌లో ఉన్నామన్న మాటే గానీ మాకు, ముఖ్యంగా నాకు, మనశ్శాంతి లేకుండాపోయింది.

యుద్ధానికి అనుకూలంగానూ, ప్రతికూలంగానూ బలంగానే వాదనలు వినిపించడం మొదలయ్యాయి. కానీ, నాకు ఆ రెండు వాదనల్లోనూ కూడా ఏదో లోపం ఉందనిపించింది. నేనున్న మనఃస్థితిలో నాకు ఓదార్పునివ్వగలిగింది మాస్టారే అనిపించి ఆయనకు ఉత్తరం రాశాను. ప్రపంచం ఇప్పుడున్న స్థితిలో ఏ దేశమూ కూడా శాంతి స్థలం కాదేమోనని ఆయనకు రాస్తూ బాబ్రీ మసీద్‌ను కూలగొట్టిన దేశంలో మతానికి అతీతమైన మానవత్వం కనబడగలదా అని కూడా రాశాను.

దానికి ఆయన ఎటువంటి జవాబు రాశారని!

ఆయన అన్నారు కదా: ‘తాత్కాలిక సంఘటనలను, ఉద్రేకాల్నీ బట్టి నిర్ణయాలకు రాకు. బాబ్రీమసీద్‌ను కూల్చిన దేశంలోనే రెండువందల ఏళ్ళకుపైగా ముస్లింరాజులు ఆదరించిన రాముడి దేవాలయం కూడా ఉందన్నది మర్చిపోలేం. మనం భద్రాచలం వెళ్దాం. ఆ నేలా, ఆ గాలీ, ఆ నదీ మనని ఈ  తాత్కాలికసంక్షోభాల్నించి దూరంగా తీసుకువెళ్లగలదు’ అని రాసారాయన.

2

ధనుర్ధారుల ప్రపంచం

మాటల్లో పెట్టలేని మహత్తరమైన ఉద్వేగంతో భద్రాచలం బస్టాండ్‌లో దిగగానే అప్పుడే విరిసిన పువ్వులాగా చిరునవ్వు చిందిస్తూ మాస్టారు. నా చేతిలో బ్యాగ్ అందుకుంటూనే, నా చేతిలో నైపాల్ పుస్తకాన్ని చూస్తూ మరొకసారి చిరునవ్వు నవ్వారు.

ఆయన నన్ను సరాసరి దేవస్థానం కాటేజీకి తీసుకువెళ్ళారు. ‘దర్శనానికి ఇప్పుడేనా’ అని అడిగితే, ‘నువ్వు తొందరగా తయారవ్వు. మనం ఈ రోజు దేవుడిని గుడిలో కాదు, ఆరుబయట ఆకాశం కింద ప్రకృతిఒడిలో చూడబోతున్నాం’ అన్నారు.

నేను తయారయ్యేటప్పటికి బయట జీప్ వచ్చి ఉంది. మాస్టారు తన పక్కనే ఉన్న ఇద్దరు మిత్రుల్ని పరిచయం చేశారు. ఒకరు ఉత్తమ్, మరొకరు వసంత్.

‘నువ్వు పాపికొండల్ని ఎప్పుడైనా  చూశావా?’ మాస్టారి ప్రశ్న.

ఆ మాట వినగానే నాలో ఎప్పటివో జ్ఞాపకాలు తుళ్ళిపడ్డాయి. నా కాలేజి రోజుల్లో స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళిన ఆ ముసురు పట్టినరోజు ప్రయాణం. కానీ, నిజంగా ఆ కొండల్ని నేను చూశానని చెప్పగలనా? లాంచీ హోరూ, వాళ్ళు పెట్టిన మధ్యాహ్న భోజనం, కొండలకు ఇరువైపులా ఏవో గూడేలూ, కట్టెల మోపులూ – ఇవే అప్పటి నా జ్ఞాపకాలు.

‘ఇప్పుడు పాపికొండలు చూడడానికి వెళ్తున్నాం’ అని మాస్టారు అనగానే ముందు నమ్మలేకపోయాను. ఉద్విగ్నభరితమైన హృదయంతో, నమ్మలేని కళ్ళతో ఆయనవైపు చూస్తుంటే, ఆయన నా భుజం తట్టి, ‘రా, కూర్చో’ అని జీప్ వైపు దారి తీశారు.

భద్రాచలం నుంచి కూనవరం జీప్ ప్రయాణం దాదాపు గంటన్నర పట్టింది. దట్టమైన అడవిదారుల్లో ఆ ప్రత్యూషవేళ ప్రయాణం నా అంతరంగాన్ని నెమ్మదిగా శుభ్రపరుస్తూ వచ్చింది. ఆకులగుబుర్ల లోంచి సూర్య కిరణాలు వెండితీగల పందిరిని అల్లుతున్నాయి. ‘నీ హృదయం నాకు తెలుసు. నువ్వు ఇరుకుదారుల్నీ, నాలుగుగోడల్నీ భరించలేవు. అందుకే ఈ ఆకాశపందిరి కిందకు తీసుకు వచ్చాను’ అన్నట్టుండే మాస్టారి ప్రేమభరిత మృదుహాసం దారిపొడుగునా!

కూనవరం దగ్గర ఎదురైన ప్రవాహాన్ని చూడగానే సంతోషంతో, ‘గోదావరి ఎంత నిండుగా ఉంది’ అంటుంటే మాస్టారు సవరించారు. ‘ఇది శబరి. గోదావరిలో ఇక్కడే కలుస్తుంది. మధ్యభారతదేశంలోని మహారణ్యాల్లో పుట్టి ఆదివాసుల జీవనసుగంధాన్ని తీసుకు వచ్చే నది ఇది’ అన్నారు.

కూనవరం ఒడ్డు దగ్గర రాజమండ్రికి బయలుదేరుతున్న లాంచీలో ప్రయాణికులు చేరుకున్నారు. మాస్టారన్నారు కదా, ‘నిజానికి మనం ఈ లాంచినే ఎక్కాలి. కానీ, అందరిలానే నిన్నూ ఈ రేవులోనే ఈ ప్రయాణంలోకి ప్రవేశపెట్టడం నాకు ఇష్టంలేదు. ఇంతకన్నా రహస్యసుందరమైన మరో రేవులో ఎక్కబోతున్నాం’ అన్నారు.

అక్కడ మేం కొద్దిగా ముందుకు పోయి ఇంజన్ పడవపైన శబరి నదిని దాటాం. అప్పుడే నీరు పెడుతున్న పొగాకుచేల మధ్య నుంచి అవతలి ఒడ్డుకు కొంతదూరం నడవగానే అక్కడ మరొక జీప్ మా కోసం ఎదురు చూస్తోంది. ‘ఈ ఏర్పాట్లన్నీ మన మిత్రులు ఉత్తమ్, వసంత్ చేశారు మన గురించి’ అని వారిని చూపిస్తుంటే కృతజ్ఞతగా చిరునవ్వునవ్వడం మినహా మరేమీ చేయలేకపోయాను.

జీప్ కొంత దూరం పోగానే వరరామచంద్రపురం దగ్గర కాఫీ తాగాం. ఆ తర్వాత ఓ గంట ప్రయాణం. ఒంటరి    దారుల్లో, కొండ వాలుల్లో నిండుగా పూసిన అవిసె చేల మధ్య మలుపులు తిరుగుతూ జీప్ ముందుకు సాగుతోంది. అక్కడక్కడ దూరంగా కనిపిస్తున్న పల్లెల్ని చూపిస్తూ మాస్టారు చెప్తున్నారు, ‘మనం ఈ దేశంలో అత్యంత పురాతనమైన మానవ సమూహాలుండే ప్రాంతంలోంచి ప్రయాణిస్తున్నాం. కొండరెడ్లు గిరిజనులు మాత్రమే కాదు, అత్యంత ఆదిమ గిరిజనులు కూడా’

‘మనం ఏదన్నా ఒక కొండరెడ్డి పల్లెని చూడడం వీలవుతుందా’ అన్న నా ప్రశ్నకి మెరిసే కళ్ళతో, ‘నువ్వీ ప్రశ్న అడుగుతావనే, మన ఉత్తమ్ మననిప్పుడు దారపల్లి తీసుకు వెళ్తున్నాడు’ అన్నారు.

జీప్ రోడ్డు విడిచి గతుకుల బండి దారి వెంబడి రెండు మూడు కిలోమీటర్లు దట్టమైన అడవి గుండా లోపలికి ప్రయాణం చేసింది. పచ్చని కొండల మధ్య, ఎదిగిన జొన్నచేల మధ్య, ఆరోగ్యంగా పెరిగిన గుమ్మడితీగలాగా మాకు ఎదురైంది దార్లపల్లి.

కొండరెడ్ల ఆ పల్లెలో ఆదివారం తీరిక ఉదయం పిల్లలు ఆడుకుంటున్నారు. విరగబూసిన కుంకుడుచెట్ల గుబుర్లలో సీతాకోకచిలుకలు ఎగురుతున్నాయి. తేనెటీగల మర్మరధ్వని నేపథ్య సంగీతంగా వినిపిస్తోంది.

ఊరిలోని ఆడా మగా కొందరు పొలంపనిలోనూ, కొందరు ప్రభుత్వం ఇచ్చిన పక్కా ఇళ్ళ నిర్మాణంలోనూ ఉన్నారు. మమ్మల్ని చూడగానే వారందరిలో ఉత్సాహం. ఈ కొత్తవారెవరో అన్న బెరుకు గానీ, ఔదాసీన్యం గానీ లేవు. ‘రండి రండి’ అన్న ఆహ్వానమే గాని, ‘మీరెవ’రన్న అనుమానం లేదు. కొద్దిసేపట్లోనే ఊరంతా మిత్రులయిపోయారు.

‘సువిదితా, ఈ ఇల్లు చూడు.’ మాస్టారు చూపిస్తున్న కొండరెడ్డి ఇంట్లో అడుగుపెట్టాను. ఆ ఇల్లు – ఇల్లనవచ్చునా దాన్ని? అది ఒక నీడ.

దాన్లో మనిషి రోజువారి అవసరాల్ని మించిన ఏ వస్తుసంచయమూ లేదు. వెదురు బుట్టలు, చాటలు, కత్తి, గొడ్డలి వంటి కనీస సామగ్రి. మీద న్యూస్‌పేపర్ల నుంచి కత్తిరించి అతికించిన చిరంజీవి, సౌందర్య బొమ్మలు. లోపల చూరుల్లో వేలాడుతున్న నెమలి పింఛం గుత్తి. ఆ ఇంటి యజమాని కోండ్ల భీమిరెడ్డి అప్పుడే తన ఉదయపు భోజనం పూర్తి చేసుకున్నాడు. గుమ్మడికాయ కూరతో అన్నం. అతని భార్య వరలక్ష్మి. నలుగురు పిల్లలు. ఇద్దరు ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నారు. ఇద్దరు బయట ఆడుకుంటున్నారు. ఆ చిన్న పరివారం, ఆ ఇల్లు వారిపట్ల నాకు చెప్పలేనంత ఆత్మీయత కలిగించాయి.

భీమిరెడ్డి నన్ను తన జొన్న చేనుకు తీసుకు వెళ్ళాడు. జొన్న చేలో అలసందలు కాయలు కాసి ఉన్నాయి. వాటిని అంటిపెట్టుకుని పురుగులు. ‘ఈ పురుగుల్ని చంపడానికి మందులున్నాయని తెలుసా’ అని అడిగాను.

భీమిరెడ్డిలో ఆశ్చర్యం కనిపించలేదు. నేలతల్లి ఇచ్చిన వాటిలో ఎవరి వాటా వారిదన్న ప్రశాంతనిర్లిప్తత అతనిలో కనబడింది. చేను మధ్య మంచె పైన కాపలా లేదు. పిట్టల్ని బెదిరించడానికి గొట్టకర్ర ఇవాళో, రేపో తయారు చేయాల్సి ఉందని అతను స్వగతం చెప్పుకున్నట్టుగా నాతో చెప్పాడు.

చేల మధ్య విల్లంబులతో వేటకు బయలుదేరిన కొండరెడ్లు నన్నాకర్షించారు. భీమిరెడ్డి చెప్తున్నాడు, ‘ఇంకా కొండరెడ్లు వేటని వదులు కోలేదు. ఇప్పటికీ బాణం పట్టుకు బయలు దేరితే, ఒకటో అరో జంతువులు పడక మానవు. తక్కిన రోజుల్లో ఈ పంటలే ఆధారం.’

బాగా బిగించిన వెదురుబద్దపైన నెమలి ఈకలు చుట్టిన అంబుని ఎక్కుపెడుతున్న కొండరెడ్డి యువకుల్ని చూడగానే కంప్యూటర్ల ప్రపంచం నుంచి ధనుర్ధారుల ప్రపంచంలోకి వచ్చానని స్ఫురించింది నాకు.

మేం చేలు చుట్టి వచ్చేటప్పటికి మాస్టారు మా కోసం ఆనపతీగ పందిరి కింద, వెదురు పొద నీడన కొండరెడ్డి నృత్యాన్ని ఆవిష్కరించి ఉంచారు. మెడలో డోలు వాద్యంతో మా ముందు నిల్చున్న అదిమ గాయకుడి పేరు అందెల కన్నపురెడ్డి.

నమూనాగా ఓ పాటని వినబోతున్నానన్న ఊహతో అతన్ని ఒక రాగం తీయమని అడిగాను. ఆ గాయకుడు తన చర్మవాద్యంపై తట్టగానే, వెనుక మరో ఇద్దరు యువకులు పొడవయిన రుంజవాద్యాలతో వంత కలిపారు. ఆ గాయకుడు ‘లేలో లేలన్నో రులేలో లేలో’ అని రాగం తీయగానే అంతదాకా అనాహతంగా ఉన్న అపూర్వమాధుర్యమేదో ఉలిక్కిపడ్డట్టు అనిపించింది.

మామిడికాయల పండుగలో సార్లమ్మ తల్లికి మొక్కులు తీర్చుకోవడానికి తమ తోటి రెడ్లు కోలాహలం చేస్తున్నప్పుడు, కొండరెడ్డి యువతీయువకులు పాలపూలూ, ఇప్పపూలూ పూసిన అడవిదారుల్లో పరాచికాలు ఆడుతున్నప్పుడు, చెట్టుకొమ్మల్లోంచి చీల్చుకు వచ్చే లేతచివుళ్ళ మాధుర్యభరిత వసంతసంతోషమేదో ఆ రాగంలో నాకు వినిపించింది. తమ ఏ ఆనందజ్ఞాపకాల్ని ఆ స్వరం రాపాడిందో గాని, ఒకరి వెనుక ఒకరు స్త్రీలు ఆ వెదురుపొద దగ్గరకు చేరి చేతులు కలిపేరు.

దార్లపల్లి వదిలి మళ్ళీ జీప్ రోడ్డు ఎక్కినప్పుడుగానీ నాకీ ప్రపంచం గుర్తుకు రాలేదు. తుమ్మెదలు మూగిన పూలగుబుర్లూ, వేటకు ఎక్కుపెట్టిన విల్లంబులూ, స్వరచలితమైన ఆదిమగాయకుని హృదయావేశం, దానికి అడుగులు కలిపిన ఆదివాసీ స్త్రీ బృందం నన్ను మరో లోకంలోకి తీసుకుపోయాయి.

‘ఈ జీవితం పైకి కనిపిస్తున్నంత సుందరం కాదు’ మాస్టారు చెప్తున్నారు. ‘ఆ పిల్లల్ని చూడు. వాళ్ళ అనారోగ్యం స్పష్టంగా తెలియడం లేదూ. ఏడాదిలో 6 నెలలు వారికి ఆహారం పెద్ద సమస్య. ఆ ఊరికి ఇంకా కరెంట్ లేదు. రోడ్డు లేదు. ప్రభుత్వం వేసిన సోలార్ దీపాల్ని ఎవరో ఎత్తుకుపోయారు. వీటి గురించి కూడా నీ ఆలోచనల్లో కొద్దిగా చోటు మిగుల్చు.’


In the Lap of Papikondalu

1

Bhadrachalam

The winter dawn was breaking pale and soft. Our bus was entering the outskirts of Bhadrachalam. From afar, the lights atop the hill sparkled gently. My heart leaped with joy as the immortal line came to mind: “Behold Bhadradri, behold the Gautami, shining matchless and beautiful with dazzling spires and discs!”

Just a few hours after we left America, the World Trade Center was attacked. By the time we landed in India, people gathered around us in anxious concern. Yet those very people who showered us with sympathy in those first moments began looking at us as though we were somehow at fault as soon as bombs started raining on Afghanistan. Merely because we lived in America, it felt as if we were being held responsible for all the political turns of that country. Though we were physically in Hyderabad, we had no peace of mind—especially myself.

Fierce arguments began to echo everywhere, both in favor of the war and against it. But to me, both sides seemed deeply flawed. Feeling that Master alone could bring solace to my troubled state of mind, I wrote him a letter. Wondering whether any corner of the earth could truly be a sanctuary of peace in the world’s present state, I also asked him whether a humanity transcending religion could ever be found in a land that had demolished the Babri Masjid.

What an extraordinary reply he sent back!

He wrote: “Do not rush to conclusions based on transient events and passing passions. In the very land where the Babri Masjid was demolished, there also stands a temple of Rama nurtured and revered by Muslim rulers for over two hundred years—we cannot forget that. Let us go to Bhadrachalam. That soil, that air, and that sacred river can lift us far above these passing crises.”

2

The World of Bowmen

Stepping off the bus at the Bhadrachalam station with emotions too deep for words, I was greeted by Master, beaming with a smile like a freshly blossomed flower. Taking the bag from my hand, he noticed the V.S. Naipaul book I was carrying and smiled warmly once again.

He took me straight to the temple guest house. When I asked, “Are we going for darshan right away?”, he replied, “Get ready quickly. Today, we are not going to see God inside four temple walls, but out in the open, under the wide sky, in the very lap of nature.”

By the time I was ready, a jeep had pulled up outside. Master introduced two friends standing beside him—one was Uttam, and the other, Vasanth.

“Have you ever seen Papikondalu?” Master asked.

At those words, old memories stirred within me. Back in my college days, I had gone on a holiday picnic with friends on an overcast, drizzly day. But could I truly say I had seen those hills? The droning roar of the launch, the lunch they served, a few scattered tribal hamlets on either bank, and bundles of firewood—those were all that remained in my memory.

When Master said, “We are going to see Papikondalu now,” I could hardly believe it at first. As I looked at him with an eager heart and wide, incredulous eyes, he patted my shoulder, said, “Come, hop in,” and led me to the jeep.

The drive from Bhadrachalam to Kunavaram took about an hour and a half. Traveling through dense forest roads in that early dawn quietly cleansed my inner being. Sunlight filtering through the canopy wove a pavilion of silver threads. Master’s gentle, affectionate smile throughout the journey seemed to say: “I know your heart. You cannot endure narrow pathways and confining walls. That is why I have brought you beneath this open pavilion of the sky.”

Seeing the wide river near Kunavaram, I exclaimed joyfully, “How full the Godavari looks!”

Master corrected me gently: “This is the Sabari. It merges with the Godavari right here. Originating in the primeval forests of Central India, this river carries the sweet fragrance of tribal life.”

At the Kunavaram riverbank, passengers were boarding a launch bound for Rajahmundry. Master said, “We could board this launch, but I don’t want you to begin this journey at a crowded landing like everyone else. We are going to board at another boat point—one that is far more secluded and beautiful.”

We went a little further ahead and crossed the Sabari on a small motorized boat. Walking a short distance across the far bank through freshly watered tobacco fields, another jeep stood waiting for us. “Our friends Uttam and Vasanth made all these arrangements for us,” Master said, pointing to them. I could do nothing but smile in quiet gratitude.

After driving a little further, we stopped for coffee near Vara Ramachandrapuram. Then followed another hour of travel. The jeep wound its way along lonely tracks and hill slopes blanketed with blooming fields of avise (sesbania). Pointing to a few villages visible in the distance, Master said, “We are traveling through a region inhabited by some of the most ancient human communities in this country. The Konda Reddys are not just tribals; they belong to the most primitive indigenous groups.”

When I asked with eager curiosity, “Would it be possible for us to visit a Konda Reddy village?”, Master replied with glowing eyes, “I knew you would ask that. That is why our Uttam is taking us to Darlapalli right now.”

Leaving the paved road, the jeep bumped along a rutted cart track for two to three kilometers deep into the dense forest. Cradled between lush green hills and tall sorghum fields, Darlapalli appeared before us like a thriving, healthy pumpkin creeper.

In that Konda Reddy hamlet, children were playing in the leisurely calm of a Sunday morning. Butterflies fluttered among the clusters of soapnut trees in full bloom. The low hum of honeybees played in the background like ambient music.

Some village men and women were working in the fields, while others were helping build permanent houses provided by the government. The moment they saw us, they were filled with warmth. There was neither hesitation nor indifference toward strangers. It was an open, heartfelt welcome—“Come, please come!”—without a trace of suspicion about who we were. Within moments, the entire village felt like friends.

“Suviditha, look at this home,” Master called out, and I stepped into a Konda Reddy dwelling.

That house—could one even call it a house? It was simply a shelter of shade. Inside, there was no accumulation of possessions beyond the bare daily necessities of life: bamboo baskets, winnowing trays, a knife, an axe, and other basic tools. On the walls hung newspaper cutouts of actors Chiranjeevi and Soundarya. Tucked beneath the inner eaves was a bouquet of peacock feathers.

The master of the house, Kondla Bhimi Reddy, had just finished his morning meal of rice with pumpkin curry. His wife was Varalakshmi. They had four children—two studying in an ashram school, and two playing outside. That small family and their humble home stirred a deep, inexplicable warmth within me.

Bhimi Reddy took me to his sorghum field, where cowpea pods hung abundantly, dotted with insects. “Do you know there are pesticides to kill these pests?” I asked.

Bhimi Reddy showed no surprise. In him, I saw a serene detachment—a feeling that whatever Mother Earth yields belongs to every living creature in its own measure. The watchman’s platform (manche) in the middle of the field stood unmanned. Speaking as if in a quiet soliloquy, he mentioned that he would have to fashion a wooden rattle in a day or two to scare away the birds.

Out in the fields, a group of Konda Reddys setting out to hunt with bows and arrows caught my eye. Bhimi Reddy explained, “The Konda Reddys haven’t given up hunting yet. Even today, if they step out with a bow, they rarely return without an animal or two. For the rest of the days, these crops are our sustenance.”

Watching those young Konda Reddy men nock arrows bound with peacock feathers onto taut bamboo bows, it struck me that I had stepped straight out of the world of computers and into the world of bowmen.

By the time we walked back around the fields, Master had arranged a Konda Reddy dance for us under the shade of a bamboo thicket beneath a bottle-gourd trellis. Standing before us with a dolu (drum) slung across his neck, the indigenous lead singer was named Andela Kannapu Reddy.

Expecting a brief sample of a folk song, I asked him to begin a melody. The singer tapped on his leather drum, and behind him, two young men joined in with long runja percussion instruments. As the singer broke into the refrain—“Lelo lelanno rulelo lelo”—it felt as though an unplucked, rare sweetness had suddenly awakened the air.

In that melody, I heard the joyous spring celebration of Konda Reddy youths teasing each other along forest trails blooming with pala and mahua flowers, and the festive bustle of fellow Reddys fulfilling vows to Mother Sarlamma during the Mango Harvest Festival. Whatever joyful memories that voice tapped into, women began gathering one after another near the bamboo grove, joining hands in a rhythmic dance.

It was only when we left Darlapalli and our jeep hit the main road again that I returned to ordinary reality. The flowering trees buzzing with bees, the bows drawn for the hunt, the primal passion stirring the heart of the folk singer, and the indigenous women matching his rhythm step for step had transported me into an entirely different realm.

“This life is not as idyllic as it appears on the surface,” Master observed gently. “Look at those children. Isn’t their frailty and malnutrition plainly visible? For six months of the year, food remains a severe struggle for them. The village still has no electricity. No paved road. Someone stole the solar lamps installed by the government. Make sure you leave a little room in your thoughts for these realities as well.”

31-8-2026

2 Replies to “నేను తిరిగిన దారులు-9”

  1. “Do not rush to conclusions based on transient events and passing passions. In the very land where the Babri Masjid was demolished, there also stands a temple of Rama nurtured and revered by Muslim rulers for over two hundred years—we cannot forget that.”

    “This life is not as idyllic as it appears on the surface”

    Yes, sir…
    Truth revealing statements.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading