కొన్ని కలలు కొన్ని మెలకువలు -7

అధ్యాయం-2

1

కర్మ భూమి

తాడికొండ పాఠశాల వదిలిపెట్టిన పదేళ్ల తరువాత. ఊహించని విధంగా నాకు రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో జిల్లా గిరిజనసంక్షేమాధికారిగా ఉద్యోగం లభించింది. ఎనిమిది నెలల ట్రయినింగ్‌కు గాను నన్ను సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్ధ, పార్వతీపురం వెళ్లమని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

నా ఉద్యోగం రూపురేఖల గురించి నాకు కనీస అవగాహన కూడా లేదు. పార్వతీపురానికి నేను అంతముందెన్నడూ వెళ్లి ఉండలేదు కూడా. కొత్త ఉద్యోగానికి, కొత్త స్ధలానికి వెళ్లడం కాబట్టి నాకు తోడుగా మా అన్నయ్య కూడా వచ్చాడు. నేను సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు అధికారి ముందు హాజరయి నా జాయినింగ్ రిపోర్టు ఇచ్చి నా శిక్షణకు ఏర్పాట్లు చెయ్యమని అడిగాను.

నాకు ప్రభుత్వం ఇచ్చిన శిక్షణ ప్రకారం మొదటి రెండు వారాలు ఏదన్నా హాస్టలుకి వార్డెన్‌గా పనిచెయ్యవలసిఉంటుంది. అందులో ఆ హాస్టలు నిర్వహణ బాధ్యతను వారంరోజులపాటు నేనే పూర్తి బాధ్యతతో చూడవలసి ఉంటుంది.

నేను మర్నాడు ఆఫీసుకి వెళ్లేటప్పటికి నాకు గుమ్మలక్క్ష్మీపురం మండలం లోతట్టు అడవిలో ఉండే గొయిపాక అనే చోట ఉండే ఆశ్రమ పాఠశాలకి వెళ్లి చేరమని ఉత్తర్వులు ఇచ్చి ఉన్నాయి. ఆ ఉత్తర్వులు వేసిన ప్రాజెక్టు అధికారీ, జిల్లాసంక్షేమాధికారి కూడా నాకు అందుబాటులో లేరు. వారు స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు గాను ఎక్కడికో కేంపుకు వెళ్లిపోయారు. ఆ ఊరు ఎక్కడుందో, ఆ ఊరికి ఎలా చేరాలో అక్కడెవరికీ తెలియదు. నా ఉత్తర్వుల గురించీ, ఆ ఊరికి వెళ్లే దారి గురించీ చాలాసేపు తమలో తాము చర్చించుకున్నాక ఆ ఆఫీసు సిబ్బంది మాకు స్ధూలంగా ఒక దారి చూపించారు. దాని ప్రకారం మేం పార్వతీపురం నుంచి రాయగడ వెళ్లే దారిలో ఒరిస్సా సరిహద్దుల్లో   ఉండే జిమిడిపేట అనే గ్రామంలో దిగాలి. అక్కణ్ణుంచి ఎవరినన్నా అడిగితే దారి చూపిస్తారు. ఇదీ వారిచ్చిన సూచన.

నాతో పాటు మా అన్నయ్య కూడా నాకు తోడు వస్తానన్నాడు. మేం ఆ మధ్యాహ్నం రాయగడ బస్సు ఎక్కాం. బస్సు పార్వతీపురం వదిలిన అరగంట తర్వాత మహా పర్వతశ్రేణులు సుదూరంగా కనబడసాగాయి. వాటిపైన నీలం వన్నె తిరిగిన మహారణ్యాలు. బస్సు కూనేరు అనే ఊరు చేరేటప్పటికే ఆకాశమంతా నల్లని మబ్బులు ముసురుకోవడం మొదలుపెట్టాయి. దారులన్నీ మూసుకుపోయేటట్టుగా మహావర్షానికి సూచనగా మబ్బులు, ఉరుములు, మెరుపులు.

మేం జిమిడిపేట గ్రామంలో దిగేటప్పటికి బాగా చీకటి పడిపోయింది. అదొక ఒరిస్సా గిరిజన గ్రామం. అక్కడ దిగి మాకు కనబడ్డ ఇంటిలో అడుగుపెట్టాం. వివరాలడగవచ్చని. అదొక ఒరియా ఉపాధ్యాయుడి ఇల్లు. ఇల్లు అనడానికి లేదు దాన్ని. బీదరికం అక్కడ కొట్టొచ్చినట్టుగా కనబడుతూంది.

ఆయనకీ, మా అన్నయ్యకీ మధ్య హిందీలో సంభాషణ జరిగింది. మేం ఆ రాత్రి గొయిపాక వెళ్లడానికి అక్కడ దిగామని విని ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి గొయిపాక వెళ్లాంటే అక్కణ్ణుంచి సుమారు ముీప్పై కిలోమీటర్ల పాటు అడవి దారిని కొండల మీద ప్రయాణించవలసి ఉంటుంది. అన్నిటికన్నా ముందు నాగావళిని దాటవలసి ఉంటుంది.

నాగావళిని దాటడానికి పడవలు కాదు సరి కదా తెప్పలు కూడా ఉండవు. కాలి నడకన దాటవలసి ఉంటుంది. వర్షానికి ఆ రాత్రి నాగావళికి వరద కూడా వచ్చి  ఉండవచ్చు. ఏ విధంగా చూసినా కూడా ఆ రాత్రి గొయిపాక వెళ్లడం అసాధ్యం. అతడిచ్చిన సలహా ఏమిటంటే ఆ రాత్రే మేం రాయగడ వెళ్లిపోయి ఆ మర్నాటి ఉదయం జిమిడిపేట వచ్చి ప్రయాణం చేపట్టడం మంచిది.

మేం అలాగే చేసాం. ఆ మర్నాడొక గ్రామీణుడు మాకు దారి చూపడానికీ, మా సామగ్రిని కావడి కట్టి మొయ్యడానికి ఒప్పుకున్నాడు. హాస్టల్ అనేటప్పటికి బహుశా ఏదన్నా వసతి సౌకర్యం ఇతరత్రా సౌకర్యాలూ ఉండే చోటకి పంపుతారేమో ననుకొని నేను చదువుకోవడానికి కొంత సాహిత్యం కూడా సిద్ధం చేసుకున్నాను. అందులో టాల్‌స్టాయ్ ‘వార్ అండ్ పీస్ ’ కూడా ఉండటంతో ఆ లగేజి మరీ బరువుగా వుంది. మేం జిమిడిపేట ఊళ్లో నుంచి కిలోమీటరన్నా నడిచామో లేదో సరసర ప్రవహిస్తున్న అడివిపాములాగా నాగావళి ఎదురయ్యింది.

నదికి అవతలి వైపున పర్వతాల వరుస. వాటిమీద ఆకుపచ్చని మహారణ్యాలు. ఆ పత్రహరితం మీద ఉదయసూర్యకాంతి. ముందు రోజు కురిసిన వర్షానికి గాలంతా తేమ ఆవరించి ఉంది. ఆ తేమలో సూర్యకాంతి నిర్మలంగా ప్రతిఫలిస్తోంది. నేలంతా చిత్తడిగా ఉంది. నది ముందుకు చేరగానే నేను అప్రయత్నంగా నమస్కరించాను. నదులకి నమస్కరించడం నాకు అలవాటుయిపోయినందువల్ల మాత్రమే కాదు. నా జీవితంలో మరొక కొత్త ప్రయాణానికి సన్నద్ధుణ్ణవుతున్నానన్న మెలకువ కూడా దానికి కారణమనాలి.

మేం దాదాపుగా మాదుస్తులన్నీ విప్పి నదిని దాటాం. ఇక నదిని దాటిన తర్వాత మేం నాగరిక ప్రపంచానికి, ఇరవయ్యవ శతాబ్దానికి దూరంగా ఒక్కొక్క అడుగే వెయ్యడం మొదలుపెట్టాం. అలాగ పొద్దున్న తొమ్మిది గంటల వేళ మొదలయిన మా కాలినడక కొండలు ఎక్కీ దిగుతూ మహారణ్యమధ్యంలో కనబడని కాలిబాటల్ని పట్టుకుంటూ మధ్యాహ్నమయ్యేటప్పటికి బీరుపాడు అనే కోదు గ్రామానికి చేరింది. మా సహాయకుడు మమ్మల్ని అక్కడుండే ఆశ్రమ పాఠశాల ఆవరణకి తీసుకువెళ్లాడు.

ఆశ్రమ పాఠశాల అనవచ్చునా దాన్ని ? అదొక గడ్డిపాక. ఆ రోజు దానికి కొత్త గడ్డి నేస్తున్నారు. పిల్లలు ఆరుబయట ఆడుకుంటున్నారు. మేం ఆ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుణ్ణి కలిసాం. ఆయన ఆ ఉదయం కొత్త గడ్డి నేసే కార్యక్రమాన్ని తీరుబడిగా పర్యవేక్షిస్తూ ఉన్నాడు. పార్వతీపురం ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగి ఆ    ఉపాధ్యాయుడికివ్వమని సిఫార్సు లేఖ ఇచ్చాడు. నేనా లేఖని ఆ ఉపాధ్యాయుడికి అప్పగించాను. ఆయన పేరు సుధాకరరావు.

నేను శిక్షణ కోసం వచ్చిన అధికారినని తెలియగానే ఆ ఉపాధ్యాయుడి ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. అంతదాకా అతనిలో కనిపించిన ఉల్లాసం, సౌలభ్యం స్ధానే బెరుకు, వినయం, ఇబ్బంది వచ్చి చేరాయి. ఆ మార్పు నాకు ఊపిరాడ నివ్వలేదు. అతడు మేం గొయిపాకకు వెళ్లవసి ఉంటుందని తెలియగానే నసగడం మొదలుపెట్టాడు. ‘అక్కడికి ఏం వెళ్తారు? ఆ ట్రయినింగేదో ఇక్కడే అవ్వచ్చు కదా?’ అన్నాడు. కానీ నేను ఉత్తర్వుల్లో గొయిపాక అనే ఉంది కాబట్టి నేను అక్కడికే వెళ్లాలని పట్టుబట్టాను.

అంతేకాదు, నా టయ్రినింగ్ రెండువారాలేననీ, అప్పటికే మూడు రోజులు పోగొట్టుకున్నాననీ, ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయలేననీ కూడా అన్నాను.  ఆ ఉపాధ్యాయుడు నేను గొయిపాక వెళ్లడానికి మాత్రం ఏమీ సుముఖత చూపించలేదు. ‘సరే, మధ్యాహ్నమయింది. కనీసం ఇక్కడ భోజనమన్నా చెయ్యండి’ అన్నాడు.

భోజనమయ్యాక మేం నడవడానికి సంకోచిస్తామని అతడు అనుకుని ఉండవచ్చు. కానీ కొత్తస్ధలాన్ని చూడాలన్న కుతూహలం ఒకవైపూ, నా కర్మభూమికి నేను త్వరగా చేరుకోవాలన్న ఆతృత మరొకవైపూ నన్ను నిలవనివ్వలేదు. నా వెనక మా అన్నయ్య కూడా బయలుదేరాడు. ‘ఇంతదూరం ఎలానూ వచ్చాను. ఆ ఊరిని కూడా చూసి వెళ్లిపోతే నాకు తృప్తిగా ఉంటుంది’ అన్నాడు.

మా కూడా ఒక పనిమనిషిని సాయం పంపాడు ఆ ఉపాధ్యాయుడు. మేం ఆ అపరాహ్ణవేళ మళ్లా మరొక కొండ ఎక్కిదిగాం. ఆ కొండ దిగుతుండగా దూరంగా కొండవాలుల్లో నిద్రపోతున్న పల్లెను చూపి మా కూడా వచ్చిన మనిషి ‘అదే గొయిపాక’ అన్నాడు.

పచ్చనిదొంతరలు పేర్చినట్టున్న కొండల మధ్య దట్టమైన అడవుల మధ్య విశాల నీల దిగంత సరోవరంలో నిద్రిస్తున్న పురాతన మీనంలా ఉందావూరు. మేం కొండ దిగి మళ్లా కనబడే గుట్ట ఎక్కి వాలుదారిన పైకి నడుస్తూ ఉండగా నా కళ్లు   అక్కడ పాఠశాల ఎక్కడున్నదా అని అన్వేషించడం మొదలుపెట్టాయి. నా ఊహ గమనించిన వాడల్లే మా తోటిమనిషి ‘అదిగో, అదే స్కూలు’ అన్నాడు. ఏదీ? ఎక్కడ?

నాలుగు మట్టిగోడల మీద గడ్డికప్పుతో నిలబెట్టిన చిన్న పాక. అదొక బీద కుటుంబానికి ఆశ్రయమిచ్చే నీడ తప్ప దాన్ని పాఠశాల అనలేం. ఆశ్రమ పాఠశాల అనడం అస్సలు సరిగాదు. మేం అక్కడ అడుగుపెట్టేటప్పటికి దృశ్యమేమిటంటే, అక్కడ పిల్లల్లేరు. ఉపాధ్యాయులూ లేరు. పాఠాలసలే లేవు. ఏ కలకలధ్వనీ లేదు.

పాఠశాల అవరణలో ఇద్దరు ముగ్గురు కూచుని ముచ్చట్లాడుకుంటున్నారు. వాళ్లలో ఇద్దరు ఆ పాఠశాలలో పనివాళ్లు. ఆ పాఠశాలని చూసేటప్పటికి అంతదాకా నాకు తెలియకుండానే నేనేర్పరచుకుంటూ వస్తున్న స్వప్నమొకటి చెదిరిపోయింది. అదొక దుర్భరమైన మెలకువ. అదే నా కార్యక్షేత్రమని తెలియగానే నేనేం చెయ్యాలో నాకు ఎంత మాత్రం అర్ధం కాలేదు. నా మనసొక్కసారిగా మొద్దుబారిపోయింది.

మేం గొయిపాక వెళ్లాలని అంటున్నప్పుడల్లా బీరుపాడు ప్రధానోపాధ్యాయుడు ఎందుకు సందేహిస్తూ వచ్చాడో నాకు అప్పుడు బోధపడింది. చెయ్యగలిగేదేముంది? నేను నెమ్మదిగా నా సామగ్రి దింపి అక్కడ మకాం వెయ్యడానికి ఉద్యుక్తుణ్ణవుతున్నాను.

కాని మా అన్నయ్య నన్నాపేసాడు. ‘ఇక్కడ కరెంటు లేదు. రోడ్డు లేదు. కనీసం రేడియో అయినా వినబడుతుందో లేదో తెలియదు. ఉపాధ్యాయుల్లేరు. పిల్లల్లేరు. ఇదసలు స్కూలే కాదు. ఇక్కడ నీకెవరన్నా అన్నం పెడతారో లేదో కూడా తెలియదు. దీనికన్నా దీనిముందు పాఠశాలే నయం. కనీసం అక్కడొక ఉపాధ్యాయుడైనా ఉన్నాడు. నా సలహా విని నువ్వు ఈ రెండు వారాల ట్రెయినింగూ ఆ స్కూల్లోనే గడిపెయ్యడం మంచిది’ అన్నాడు.

నేనొప్పుకోలేదు. మంచయినా, చెడయినా, సౌకర్యంగా ఉన్నా లేకపోయినా నాకు నిర్దేశించబడ్డ కార్యక్షేత్రమిదే. ఇక్కణ్ణుంచే నా ప్రస్ధానం మొదలుకావాలి. అదీ నా ఆలోచన. కొంతసేపు చర్చించాక చివరికి మా ఇద్దరికీ ఒప్పందం కుదిరింది. నేను ఆ రాత్రికి తిరిగి బీరుపాడు వచ్చేసేటట్టూ, ఈలోగా ఈ పనివాళ్లు ఈ పాఠశాల ఉపాధ్యాయులకు కబురు పంపేటట్టూ. ఆ ఉపాధ్యాయులు వచ్చిన తరువాత నేను గొయ్యిపాక వచ్చేటట్టూ నిర్ణయించుకున్నాం. తిరిగి మళ్లా కొండ ఎక్కి దిగాం. మమ్మల్ని చూడగానే బీరుపాడు ప్రధానోపాధ్యాయుడు నిశ్చింతగా ఊపిరి పీల్చు కున్నాడు.

నన్నతనికప్పగించి మా అన్నయ్య తిరిగి వెనక్కి వెళ్లిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పటికే కనుచీకటి పడుతూ ఉంది. ఆకాశంలో మబ్బులింకా తారట్లాడుతూనే ఉన్నాయి. పొద్దున లేచినప్పటినుంచి ఒకటే కొండలు ఎక్కి దిగుతున్నాం. అలసట వాడి ముఖంలో కనబడుతూ ఉంది. వాడు కూడా ఆ రాత్రి అక్కడే ఉండి మర్నాడు వెళ్లవచ్చు కదా అన్నాను. ‘సమయం లేదు, నేను వచ్చిన పని పూర్తయ్యింది. వెళ్లిపోతాను. అక్కడ అమ్మానాన్నా నీ వార్తల గురించి ఎదురు చూస్తుంటారు’ అన్నాడు.

సుధాకరరావు అతనికొక మనిషిని తోడిచ్చాడు. ఆ సన్నని కాలిబాటన దుర్గ మారణ్యాల మధ్యనుంచి వాడు నెమ్మదిగా బయటి ప్రపంచంలోకి అడుగులు వేసు కుంటూ వెళ్లిపోతుంటే చాలా సేపు వాణ్ణే చూస్తూ ఉండిపోయాను. నాకా దృశ్యం నన్ను చిన్నప్పుడు తాడికొండ స్కూల్లో వదిలిపెట్టి ఆ మర్నాటి ఉదయం మా నాన్నగారు వెళ్లిపోతూ ఉన్న దృశ్యాన్ని గుర్తుకు తెచ్చింది. అప్పుడొక విద్యార్ధిగా నేనొక న్యూఫౌండ్ లాండ్‌లో నా ప్రయాణం మొదలుపెట్టిన అనుభవం అది.

ఇప్పుడు? నేనేం చెయ్యాలో ఎంతమాత్రం స్పష్టంగా లేని భవిష్యత్తొకటి నా ముందు సుదూర పర్వతశిఖరంలాగా పొగలాగా కనిపిస్తూ ఉండింది.

ఆ రాత్రి పాఠశాల పాకలో పండుకున్నాను. నాకొక నులక మంచం వేసారు. స్ధానికంగా ఉన్న పిల్లలు వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయారు. దూరగ్రామాల పిల్లలు, ఇళ్లకు వెళ్లలేకపోయినవాళ్లు కొందరు నాతో పాటే ఆ స్కూల్లో పడుకున్నారు. వానాకాలపు చలిగాలులు తెరలుతెరలుగా కెరలిపోతున్నాయి. నెగడి మండుతూ ఉంది. దాని వెచ్చదనం మధ్యమధ్యలో మెత్తమెత్తగా తాకుతూ ఉంది.

ఆ రాత్రంతా ఆకాశం పెళపెళ ఉరుముతూనే ఉంది. మధ్యమధ్యలో మెరుపుల తళతళలు పాకలోకి కూడా ప్రసరిస్తున్నాయి. ఎక్కడో కొండచరియలు విరిగిపడ్డట్టు వర్షం దబదబబాదుతూ ఉంది. నాకు నిద్ర పట్టలేదు. నా జీవితంలో ప్రారంభమయిన ఈ కొత్త అధ్యాయం గురించి ఆలోచిస్తూ ఉన్నాను.

నేను పుట్టింది కూడా గిరిజన గ్రామంలోనే అయినా అదింత మహారణ్య మధ్యంలో. ఇంత కొండల మీద గ్రామం కాదు. ఇది నిజమైన గిరిజన గ్రామం. భూమి పుట్టినచోటకి, ఆదిమానవుడి నిజమైన ఆవాసానికి చేరినట్టనిపించింది. ఇక్కణ్ణుంచి విద్యాకార్యక్రమాలు మొదలుపెట్టాలి. ఎవరి కోసం? ఎందు కోసం?

నేనట్లా బీరుపాడులో మూడురోజులుండిపోయాను. పగటిపూట సుధాకర రావు నన్ను చుట్టుపక్కల గిరిజన గ్రామాలకు తీసుకువెళ్లేవాడు. అవన్నీ కోదుపల్లెలు. కోదుల్ని కొండ దిగువన జాతాపులంటారు. పక్కన విశాఖపట్టణం జిల్లాలో వాళ్లని సామంతులని కూడా అంటారు. నేనున్న గ్రామం ఒరిస్సా సరిహద్దులో ఉంది. అటుపక్క కోరాపుట్ జిల్లాలోని గిరిజన ప్రాంతాలు, గిరిజన గ్రామాలు. కాని అక్కడ రాష్ట్ర సరిహద్దులేవీ కనబడవు.

అటు భువనేశ్వర్‌కిగానీ, ఇటు హైదరాబాద్‌కి గానీ ఇటువంటి ప్రాంతాలు తమ పరిధిలో ఉన్నాయన్న విషయం నిజంగా తెలుసా అన్న సందేహం కలిగింది నాకు. అక్కడ కనీసం అరవతరగతి దాకా చదువుకున్న గిరిజనబాలుడెవడూ నాకు కనబడలేదు. అసలక్కడ తెలుగుభాషే వినబడదు. ఆ కోదులు మాట్లాడేది కుయి అనే పురాతన ద్రావిడభాష. ఆ మగవాళ్లకి కొద్దిగా తెలుగు లేదా ఒరియా అర్ధం కావొచ్చేమో గాని ఆడవాళ్లెవ్వరికీ తమ భాష తప్ప మరో భాష అర్ధం కాదు. ప్రతిరోజూ సుధాకరరావుకి బడికి పిల్లల్ని పిలుచుకురావడంలోనే గడిచిపోయేది.

ఆ పాఠశాలలో అతడు కాక మరొక ఇద్దరు ఉపాధ్యాయులు కూడా ఉండాలి. అంత లోతట్టు ప్రాంతానికి రావడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండకపోవడంతో ఆ రెండు పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. కాబట్టి సుధాకరరావే హెడ్‌మాస్టరు. అతడే సహాయోపాధ్యాయుడు. అతడే ఆ పాఠశాల హాస్టలు బాధ్యతలు చూడవలసిన డెప్యూటీ వార్డెన్ కూడా. తనకి తగినంత పలుకుబడిలేనందున ఎప్పటికీ తననీ కొండలమీద పాఠశాలల్లోనే నియమిస్తూ ఉంటారనీ, తనకి కూడా వీలయితే కొండ కిందనేదన్నా పాఠశాలకి వెళ్లిపోవాలని ఉంటుందనీ అన్నాడతడు నాతో.

నేను ఆ పాఠశాలలో పిల్లలతో కొద్ది సేపన్నా గడపాలని ప్రయత్నించాను. నాకది దుస్సాధ్యమనిపించింది. వాళ్ల ఏకైక ఉపాధ్యాయుడు తన నెత్తికెత్తుకున్న చాలా బాధ్యతల్ని నిర్వహించడంతోటే సతమతం కావడంతో వాళ్లకింక ప్రత్యేకంగా చదువంటూ ఏదీ నడిచే అవకాశం లేదు. కాకపోతే ఆశ్రమపాఠశాలలో ఆహారం లభిస్తుంది కాబట్టి వారక్కడికి వచ్చి గడుపుతున్నారనిపించింది. వారెవ్వరికీ తెలుగు రాదు. వచ్చే అవకాశం లేదు. రాకపోయినా నష్టమేమిటనిపించింది.

ఒక రాత్రి సుధాకరరావు నన్ను తన ఇంటికి భోజనానికి పిలిచాడు.అతని భార్య గర్భిణి. ఆ ఇల్లు, ఇల్లనాలా దాన్ని? అది ఆ కోదు వాసల్లో ఒక చివరి నీడ. ఒక వైపు ఆ ఇంటి గడ్డి మాసిపోయి, వానకి చివికి నీళ్లు లోపలికి దిగుతున్నాయి. అలా దిగిన నీళ్లతో ఆ ఇల్లు ఒక వైపంతా చిత్తడిగా ఉంది. ఆ కొట్టం లాంటి గదిలోనే మంచం, మొత్తం సామాను ఇరుకిరుగ్గా ఉంది.

ఈ మధ్యనే కొంత చోటు చేసుకుని ఆ ఇల్లాలు నాకు అన్నం పెట్టింది. కొద్దిగా నువ్వుపప్పు నూరి పచ్చడి చేసి, రెండు పప్పు వడియాలు కాల్చి వడ్డించిన విందు అది. ఆ అన్నం కూడా అక్కడ పొరుగు గిరిజన కుటుంబాలకు అలభ్యం. అక్కణ్ణుంచి తిరిగి పాఠశాలకు వచ్చానన్నమాటే గాని, ఆ రాత్రంతా నాకు ఎప్పుడో చెకోవ్ పందొమ్మిదో శతాబ్ది రష్యాలో ఉపాధ్యాయుడి స్ధితిగతుల గురించి గోర్కీతో వాపోయింది గుర్తొచ్చింది. గోర్కీ ఆ మాటల్ని ఇలా తలుచుకున్నాడు :


Chapter II

1

Karmabhoomi

Ten years after leaving the Tadikonda school, the unexpected happened. I secured a job as a District Tribal Welfare Officer through the examinations conducted by the State Public Service Commission. The government issued orders directing me to report to the Integrated Tribal Development Agency (ITDA) in Parvathipuram for an eight-month training program.

I did not have even a basic understanding of what my job would actually entail. Furthermore, I had never set foot in Parvathipuram before. Since I was traveling to an unfamiliar job in a completely new place, my elder brother decided to accompany me for support. Upon reaching the destination, I reported to the Project Officer of the ITDA, submitted my joining report, and requested him to make the necessary arrangements for my training.

According to the training schedule prescribed by the government, my first two weeks were to be spent working as a warden in a tribal welfare hostel. As part of this stint, I was required to take independent, full responsibility for managing the hostel’s day-to-day affairs for one complete week.

When I arrived at the office the following morning, I was handed official orders to report to an Ashram school located in a place called Goyipaka, nestled deep within the interior forests of the Gummalaxmipuram mandal. The Project Officer and the District Welfare Officer who had issued these orders were nowhere to be found; they had already left for a remote field camp to oversee local body elections. To make matters worse, no one in the office actually knew where this village was situated or how one might reach it. After huddled, lengthy discussions among themselves regarding my orders and the terrain, the office staff finally chalked out a vague, provisional route for us. According to their directions, we were to board a bus on the Parvathipuram-Rayagada route and get off at a border village named Jimidipeta in Odisha. From that point, they assured us, anyone we asked would guide us further. That was their only suggestion.

My brother insisted on coming along with me. That very afternoon, we boarded the bus heading toward Rayagada. About half an hour after leaving the town limits of Parvathipuram, massive mountain ranges began to unfold in the far distance. Atop those crests lay vast, dense forests tinged with a deep blue hue. By the time the bus rolled into a village called Kuneru, thick, black clouds had begun to blanket the entire sky. The sudden gathering of clouds, accompanied by sharp cracks of thunder and flashes of lightning, signaled an impending, torrential downpour that threatened to completely wash out the roads ahead.

It was pitch-black by the time we finally alighted at Jimidipeta. It was a rustic Odisha tribal village. Seeking directions, we stepped into the very first house that caught our eye. It turned out to be the residence of an Oriya schoolteacher, though it scarcely deserved to be called a house. A stark, crushing poverty was visibly stamped upon every corner of the dwelling.

A conversation in Hindi took place between the teacher and my brother. He was astonished to hear that we had stopped there with the intention of reaching Goyipaka that very night. According to him, the journey to Goyipaka required traveling about thirty kilometers through dense forest paths and over steep hills. More importantly, we first had to cross the Nagavali River.

There were no boats or even rafts to cross the Nagavali; one had to wade across it on foot. Given the heavy rains, the river might well be in flood that night. Either way, attempting to reach Goyipaka in the dark was impossible. He advised us to head to Rayagada for the night and return to Jimidipeta the next morning to begin our trek.

We followed his advice. The next morning, a local villager agreed to guide us and carry our luggage using a kavadi (a shoulder pole). Expecting that a “hostel” would be equipped with basic living facilities, I had packed a good amount of literature to read. This included Tolstoy’s War and Peace, which made the luggage quite heavy. We had barely walked a kilometer from Jimidipeta when the Nagavali appeared before us, flowing swiftly a serpent crawling out of the forest..

Across the river lay a range of mountains carpeted in deep, green forests. The morning sun lit up the foliage. Because of the previous day’s rain, the air was heavy with moisture, and the sunlight caught the dampness, making it shimmer. The ground underfoot was soft and muddy. As I reached the riverbank, I instinctively folded my hands in a silent greeting. It was not merely because I was in the habit of greeting rivers; it was also the realization that I was standing on the threshold of a new journey in my life.

We stripped off most of our clothes and waded across the river. Once on the other side, with every step we took, we seemed to move further away from the civilized world and the twentieth century. Our walk, which began at nine in the morning, led us over hills and down through thickets, following faint, nearly invisible paths deep in the forest. By afternoon, we reached a Khond village called Beerupadu. Our guide led us to the premises of the local Ashram school.

Could one even call it an Ashram school? It was little more than a thatched hut, and on that day, they were busy re-thatching the roof with new grass. Children were playing in the open space outside. We met the headmaster of the school, who was leisurely supervising the roofing work. Before I left Parvathipuram, an employee at the office had given me a recommendation letter to hand over to him. I produced the letter and gave it to him; his name was Sudhakara Rao.

As soon as he realized I was an officer arriving for training, the teacher’s demeanor shifted instantly. The warmth and ease he had shown just moments before vanished, replaced by hesitation, deep humility, and visible discomfort. This sudden change in him felt suffocating to me. The moment he understood we were bound for Goyipaka, he began to object softly. “Why go all the way there? Can’t this training just take place right here?” he suggested. But because my orders explicitly stated Goyipaka, I stood my ground.

I pointed out that my training lasted only two weeks, that I had already lost three valuable days, and that I could not afford any further delay. Still, the teacher showed no enthusiasm for our journey. “Well, it is already afternoon,” he said. “At least have your lunch here before you go.”

He likely assumed that a heavy lunch would make us reluctant to trek further. However, a deep curiosity to see this new place, combined with an urgent anxiety to reach my true destination—my karmabhoomi—kept me restless. My brother followed right behind me. “Since I have come this far anyway, I will feel at peace only if I see the village before I return,” he remarked.

The teacher sent one of his workers along to guide us. That afternoon, we climbed up and down yet another hill. As we were descending, our guide pointed toward the distant slopes where a hamlet lay nestled in quiet repose. “That is Goyipaka,” he said.

Cradled among green-layered hills and thick forests, the village looked like an ancient fish sleeping in a vast, blue lake that stretched to the horizon. As we came down the hill, walked up an approaching mound, and followed the upward slope, my eyes began searching for the school. Sensing my anticipation, our guide pointed ahead: “Look there, that is the school.” Where? Which one?

It was nothing more than a tiny hut with four mud walls and a thatched roof. It looked like a modest shelter for a destitute family; one could hardly call it a school, let alone an Ashram school. When we stepped onto the premises, this was the scene: there were no children, no teachers, and no lessons being taught. There wasn’t even the faint murmur of chatter. Two or three people were sitting outside, talking idly, two of whom turned out to be school servants. The moment my eyes fell upon that structure, a dream I had been unconsciously building shattered instantly. It was a harsh, painful awakening. Realizing that this was to be my field of action, I was completely at a loss as to what to do. My mind went entirely numb.

I finally understood why the Beerupadu headmaster had been so hesitant every time we insisted on going to Goyipaka. But what was there to be done? I slowly put down my things and prepared to set up camp right there.

However, my brother stopped me. “There is no electricity here, no road, and we do not even know if a radio can pick up a signal. There are no teachers, no children—this isn’t even a school. You don’t even know if anyone will give you a meal here. The school we just left is far better than this; at least it has a teacher. Listen to my advice and spend your two weeks of training there,” he urged.

I refused to agree. Good or bad, comfortable or not, this was my designated field of work. My journey had to begin from this very spot; that was my firm belief. After talking it over for a while, the two of us finally reached a compromise. We decided that I would return to Beerupadu for the night, and in the meantime, the school servants would send word to the regular teachers. Once the teachers arrived, I would return to Goyipaka. With that settled, we climbed up and down the hill once more. Seeing us walk back, the Beerupadu headmaster breathed a deep sigh of relief.

Having handed me over to the headmaster’s care, my brother prepared to start his journey back home. Dusk was already falling, and heavy clouds still hovered in the sky. We had been trekking up and down hills since morning, and exhaustion was clearly written on his face. I suggested that he stay the night and leave the next morning. “There is no time,” he replied. “The task I came for is complete, so I must go. Back home, Mother and Father will be anxiously waiting for news about you.”

Sudhakara Rao sent a local guide to accompany him. I stood watching for a long time as my brother slowly walked away along that narrow footpath, disappearing into the dense, formidable forest to return to the outside world. The sight vividly brought back a memory from my childhood: the morning after my father left me at the Tadikonda school. Back then, as a young student, I felt the thrill and trepidation of starting a journey in a completely new, uncharted land.

But what about now? A future where I had absolutely no clarity on what lay ahead stood before me, resembling a distant mountain peak completely shrouded in smoke. That night, I slept inside the school hut on a simple string bed they had set out for me. While the local children had gone back to their homes, a few boys from distant villages who couldn’t make the journey stayed behind to sleep in the hut with me. Outside, the cold monsoon winds blew in sharp, heavy gusts. The embers of the kitchen fire still smoldered nearby, their gentle warmth occasionally drifting over to touch us softly.

All through the night, the sky thundered violently. Every now and then, sharp flashes of lightning pierced right inside the thatched hut. The rain beat down with a relentless fury, sounding like distant landslides crashing down the hills. I could not sleep. I lay awake, turning over thoughts about this completely new chapter beginning in my life.

Although I, too, was born in a tribal village, it was nothing like this settlement in the heart of a vast forest, perched high up on the ridges. This was a true tribal village. It felt as if I had journeyed to the very place where the earth was born—the primal dwelling of early human beings. It was from this very spot that educational programs had to be launched. But for whom? And for what ultimate purpose?

I ended up staying in Beerupadu for three days. During the day, Sudhakara Rao would take me along to visit the surrounding tribal settlements. These were all Khond villages. Down at the foothills, the Khonds are known as Jatapus, while in the neighboring Visakhapatnam district, they are also referred to as Samanthas. The village we were staying in sat right on the Odisha border, facing the tribal tracts of the Koraput district on the other side. Yet, out here in the wilds, no political borders were visible.

A quiet doubt crossed my mind: did the administrations in Bhubaneswar or Hyderabad truly realize that these remote pockets fell within their jurisdiction? I did not come across a single tribal boy who had studied even as far as the sixth grade. In fact, the Telugu language was completely absent from the air. The Khonds spoke Kui, an ancient Dravidian tongue. While some of the men could manage to understand a tiny bit of Telugu or Oriya, none of the women understood a single word outside their native language. Consequently, Sudhakara Rao spent the better part of every single day just trying to gather the children and bring them to the school.

Apart from him, the school was sanctioned for two more teachers. However, because no one was willing to serve in such an interior region, both of those posts remained vacant. As a result, Sudhakara Rao had to be everything: he was the headmaster, the assistant teacher, and the deputy warden managing the student hostel all at once. He confided in me that because he lacked political influence, he was always shunted to these schools on the hills, though he harbored a quiet wish to be transferred to a school down in the plains if the opportunity ever arose.

I tried my best to spend a little time interacting with the children at the school, but it proved nearly impossible. With their lone teacher perpetually overwhelmed by the sheer mountain of responsibilities thrust upon him, there was simply no room for any structured learning to take place. It became obvious to me that the children gathered and stayed at the Ashram school primarily because it provided them with regular meals. None of them knew Telugu, and there was no real opportunity for them to acquire it. Yet, looking around, I couldn’t help but feel that even if they never learned it, they weren’t really losing anything of true value.

One evening, Sudhakara Rao invited me to his home for dinner. His wife was pregnant. That house—it felt wrong to even call it a house. It was merely a small, marginal shelter at the far end of the row of huts. The thatched grass on one side of the roof had completely rotted away, allowing the rain to leak freely inside. Because of the constant drip, an entire side of the interior was damp and muddy. In that single, shed-like room, a simple bed and all their meager household belongings were tightly crammed together.

Clearing a little space, the woman of the house served me my food. It was a simple feast of rice, a little ground sesame chutney, and two roasted lentil crisps—a meal that was a luxury completely out of reach for the neighboring tribal families. I returned to the school after that, but all through the night, I was haunted by a memory of Anton Chekhov lamenting the plight of the nineteenth-century schoolteacher to Maxim Gorky. Gorky recalled those words like this:

13-7-2026

8 Replies to “కొన్ని కలలు కొన్ని మెలకువలు -7”

  1. Cradled among green-layered hills and thick forests, the village looked like an ancient fish sleeping in a vast, blue lake that stretched to the horizon.

    Goyipaka… a tribal hamlet.

    నేనూ గొయిపాక వెళ్లాను… కొన్నాళ్ల క్రితం.

    టి.కె.జమ్ము బాలికల ఆశ్రమపాఠశాలలో పదవతరగతి వరకూ చదువుకున్న బాలికలను అక్కడ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నా మిత్రురాలు గీత ద్వారా నేను RGUKT లో ఆరుసంవత్సరాల ఇంటర్ + ఇంజినీరింగ్ కోర్సుల్లో జాయిన్ చేయించాను.

    గొయిపాక నుండి సుమలత, గుల్లలంక నుండి రోహిణి మరియు ఇజ్జకాయి నుండి శైలు అనే అమ్మాయిలకు శ్రీకాకుళం RGUKT లో అడ్మిట్ చేయించినా, గొయిపాక అమ్మాయి మాత్రమే కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. మిగిలిన వారు మధ్యలో డ్రాపవుట్ అయ్యారు. గుల్లలంక నుండే ఇంకొక అమ్మాయి అనిత ఫిఫరిష్ లో డిప్లొమా చదివి, ఇప్పుడు B.Sc Computers లో డిగ్రీ చదువుతుంది.

    గొయిపాక అమ్మాయి వైజాగ్ లో ఓ చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ లో కూడా జాయిన్ అయింది.

    1. చాలా చాలా సంతోషకరమైన వార్త సోమశేఖర్! భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు.

  2. గుమ్మలక్ష్మీపురం, జిమిడిపేట, బీరుపాడు, గొయిపాక ఏం ప్రదేశాలండీ భద్రుడు గారు.. ఆ పేర్లు ఎప్పుడూ విననే లేదు. అయితే పార్వతీపురం నుంచి రాయగడ వెళ్లే దోవలో జిమిడి పేట దగ్గర దిగి ఎవరినైనా దాటి కనుక్కుని వెళ్లాలని మీరు చెబితే అదే త్రోవలో 1989 లో పెద్ద తుఫాను మధ్యలో మా అబ్బాయి పుట్టినప్పుడు నేను చేసిన అడ్వెంచరస్ జర్నీ గుర్తొచ్చింది. అదో పెద్ద కథ లెండి.

    అయితే ఒరిస్సా సరిహద్దుల్లోని జిమిడిపేట దిగి గొయిపాక వెళ్ళే మార్గంలో మీకెదురైన నాగావళి నది జలప్రవాహం గురించి — “సరసర ప్రవహిస్తున్న అడివిపాములాగా నాగావళి ఎదురయ్యింది. నదికి అవతలి వైపున పర్వతాల వరుస. వాటిమీద ఆకుపచ్చని మహారణ్యాలు. ఆ పత్రహరితం మీద ఉదయసూర్యకాంతి. ముందు రోజు కురిసిన వర్షానికి గాలంతా తేమ ఆవరించి ఉంది. ఆ తేమలో సూర్యకాంతి నిర్మలంగా ప్రతిఫలిస్తోంది. నేలంతా చిత్తడిగా ఉంది.” అని వర్ణిస్తుంటే ఆ దృశ్యం కళ్ళ ముందర ఎంత అద్భుతంగా ఆవిష్కరించబడిందో ఆ తరువాత బీరుపాడు అనే గ్రామంలోని ఆశ్రమ పాఠశాలను మీరు చిత్రీకరించిన విధానం అంతే దైన్యంగా కనబడి తీవ్రమైన ఆవేదనకు గురిచేసింది. ఇంక గొయిపాక పాఠశాల గురించి మీరు వివరించిన తీరు కళ్ళనీళ్ళ పర్యంతం చేసేసిందండీ..

    అటువంటి కారడవి ప్రయాణంలో కూడా మీ వెంట పుస్తకాలను, అందులోనూ లియో టాల్‌స్టాయ్ ‘వార్ అండ్ పీస్’ తీసుకువెళ్ళడం పైగా ఆ పుస్తకం గురించి మెన్షన్ చేస్తూ “హాస్టల్ అనేటప్పటికి బహుశా ఏదన్నా వసతి సౌకర్యం ఇతరత్రా సౌకర్యాలూ ఉండే చోటకి పంపుతారేమో ననుకొని నేను చదువుకోవడానికి కొంత సాహిత్యం కూడా సిద్ధం చేసుకున్నాను. అందులో టాల్‌స్టాయ్ ‘వార్ అండ్ పీస్ ’ కూడా ఉండటంతో ఆ లగేజి మరీ బరువుగా వుంది.” అనడం ఎంత సింబాలిక్ గా ఉందో.. తరువాత ఎదురైన సంఘటనలు, బీరుపాడులో సుధాకర రావు గారి పూరిపాక లాంటి పాఠశాల, ఇల్లు ఆయన స్థితిగతులు ఎవరి గుండెలనైనా ఇంకా బరువెక్కిచేస్తాయి.. నాగావళి నది దాటుతున్నప్పుడు మీరు మోసిన ఆ పుస్తకం, మీ వస్తువులున్న లగేజ్ కేవలం భౌతిక బరువు. కానీ ఆ తరువాత మీ ప్రయాణంలో మోసిన మానసిక బరువు ముందు అప్పటివరకు మోసిన బరువు దూది పింజలా అనిపించి ఉండాలి. కదండీ..

    “జనసామాన్యంకోసం విస్తృత విద్యావ్యవస్ధని ఏర్పాటు చేసుకోలేని ఏ రాజ్యమైనా కూడా పచ్చి ఇటుకలతో కట్టిన భవంతి లాంటిదే. అది కూలిపోవడం తథ్యం. ఒకరు ఉపాధ్యాయుడు కావడమంటే ఏమిటి? అతడొక అభినయవేత్త కావడం. సృజనాత్మక కళాకారుడు కావడం, తన పని పట్ల తను అత్యంత వ్యామోహంతో అంకితం కావడం.” చెకోవ్ ఊహించిన విద్యా వ్యవస్థ, పాఠశాలలు, ఉపాధ్యాయులు, ఇవన్నీ గౌరవించే సమాజం అసలు సాధ్యమేనా అనిపిస్తోంది.. రవీంద్ర కుమార్ శర్మ గారి జీవన శిల్పి సిరీస్ లో కూడా ఇలాగే అనిపించింది ఆయన ప్రాచీన విద్యా వ్యవస్థ గురించి చెబుతూ ఆధునిక విద్యా వ్యవస్థ గురించి వాపోయినప్పుడు.

    చివర్లో అంటోన్ చెకోవ్ రష్యాలో ఉపాధ్యాయుల దీనస్థితి గురించి గోర్కీ తో వెలిబుచ్చిన సంగతుల గురించి తెలుసుకున్నాక మీరన్నటు ఆ గొయిపాక, బీరుపాడు అడవుల్లో జీవిస్తున్న సగటు గిరిజన ఉపాధ్యాయుల దీనస్థితిని చెకోవ్ మాటలకంటే అద్భుతంగా ఎవరూ ప్రతిబింబించలేరేమో అనిపించింది. అటువంటి విపత్కర పరిస్థితులను అధిగమిస్తూ అక్కడ రెండు వారాలు ఎలా గడిపారో.. ఆ తరువాత మీ ప్రస్థానం ఎలా జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నా ఇంకా ఎటువంటి సంగతులు తెలుసుకుంటామో అని కించిత్ ఆందోళనగా కూడా ఉంది.

    1. ఎంతో సహృదయంతో రాసిన మీ స్పందన చదువుతుంటే నాకు మరలా ఆ దారమ్మట ప్రయాణిస్తున్నట్టే ఉంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  3. సర్, గొయిపాకకు చేరుకోవడానికి మీరు చేసిన ప్రయాణాన్ని visual గా చూపించారు. చదువుతుంటే మేమూ మీతో పాటు ఆ కొండలు ఎక్కి, నాగావళి దాటి, ఆ అడవుల్లో నడిచినట్టే వుంది. Amazing writing!!

    ఆ కొండలు అడవుల్లో అడుగు పెట్టగానే మీలోని కవి అడుగడుగునా కనిపించాడు.

    కానీ గొయిపాకలో ఆశ్రమ పాఠశాల చూసినప్పుడు చాలా బాధ కలిగింది. పిల్లలు లేరు, ఉపాధ్యాయులు లేరు, పాఠశాల అనిపించే పరిస్థితి లేదు. అలాంటి చోటే ఇదే నా కర్మభూమి అని నిలబడిన మీ commitment కి 🙇🏻‍♀️.

    చివర్లో చెకోవ్ reference, మంచి ఉపాధ్యాయుడు ఉంటే సరిపోదు, అతను తన పని చేయగలిగే పరిస్థితులు కూడా సమాజం కల్పించి గౌరవించాలి అన్న విషయం ఎంత నిజమైన మాట!!

    అటువంటి గొయిపాకకు చెందిన ఒక అమ్మాయి ఇప్పుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోందని తెలుసుకుని ఎంతో ఆనందంగా అనిపించింది.
    ఆమె ప్రయాణంలో తన వంతు చేయూతనిచ్చిన సోమశేఖర్ గారికి 🙏🏽

  4. పచ్చనిదొంతరలు పేర్చినట్టున్న కొండల మధ్య దట్టమైన అడవుల మధ్య విశాల నీల దిగంత సరోవరంలో నిద్రిస్తున్న పురాతన మీనంలా ఉందావూరు.
    What an excellent visual narration .Kudos to you sir. 🙂

    ఎక్కడో కొండచరియలు విరిగిపడ్డట్టు వర్షం దబదబబాదుతూ ఉంది.

    అద్భుతమైన వాక్య ప్రయోగం…

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading