OLD SPICE MUSK

Reading Time: 2 minutes
ఒక కవిత ఎక్కడినుంచి ఎప్పుడు పుడుతుందో చెప్పలేం. చాలాసార్లు మనం కవిత కోసం దూరదిగంతాల వైపు చూస్తూ ఉంటాం. కొందరు గతంలోకీ, మరికొందరు భవిష్యత్తులోకీ చూస్తూ ఉంటారు. కాని రోజువారీ జీవితంలో, కవితని ఎవరు కనుగొనగలరో వారు ధన్యులు.
 
ఓల్డ్ స్పైస్ మస్క్ అనే ఈ కవిత నా రోజువారి జీవితంలోంచి నా చేతికి అందింది. ఓల్డ్ స్పైస్ మస్క్ అప్పట్లో నేను వాడుతుండే ఆఫ్టర్ షేవ్ లోషన్. దానిలోని కస్తూరి సుగంధం నన్ను రోజూ ఎక్కడికో తీసుకుపోతుండేది. ఏవో జ్ఞాపకాల్లోకీ, ఊహల్లోకీ. 
 
ఒక రకంగా ఇది కూడా భావకవితనే, లేదా అనుభూతి కవితనే. కాని రోజువారీ జీవితంలోని ఒక కన్స్యూమర్ ప్రోడక్ట్ కవితగా మారడంతో దీనికొక వింత సొగసు చేకూరింది. బహుశా అందుకే కాబోలు సదాశివరావు గారు ఎప్పుడు కలిసినా ఓల్డ్ స్పైస్ మస్క్, ఓల్డ్ స్పైస్ మస్క్ అంటూండేవాడు.
 
 

ఓల్డ్ స్పైస్ మస్క్

 
ఈ ప్రాచీన మహాసుగంధం కోసం
ఏ పర్వతసానువుల్లోనో
ఇంకా ఆ హరిణం వెతుకుతులాడుతూనే వుంటుంది.
 
నీవు నా ఎదట వున్నన్నాళ్ళూ
ఈ సుగంధమే జ్ఞప్తికి లేదసలు
నిండుతనువు ఒక నవచందన తరువుగా
నీ జడపాయల్లోంచి ప్రవహించిన పరిమళాలు
అన్ని దేశాల సుగంధాల గాఢనీ మరపించినాయి.
 
దూరదేశంలో ఒంటరి వేళ
నా ఒంటినిండా చిమ్మిన ఈ సుగంధంలో
నీ కన్నుల నల్లని రెక్కలు టపటపలాడి
నా గదినిండా కమ్ముకున్న తుపాను.
 
దేవదారు తరు పంక్తుల మధ్య
సాయంసంధ్యావేళలో
నెమ్మదిగా సాగుతున్న కస్తూరి మృగాల గుంపు
వాటిని వెన్నంటే ఒక మహాప్రాచీన సుగంధ ధూళి.
 
తన గుంపు నుంచి తప్పించుకుని
ఒంటరిగా ఆరాటంతో
ఈ ప్రాచీన మహాసుగంధం కోసం
ఏ పర్వత సానువుల్లోనో
ఇంకా ఆ హరిణం వెతుకుతులాడుతూనే ఉంటుంది.
 
1990
 

OLD SPICE MUSK

 
The deer might still be seeking
This ancient scent
Across the mountain slopes.
 
When you were in my presence,
This perfume didn’t cross my mind.
Like the scent of ripe sandalwood
The fragrance of your tresses
Took me away from all other odours.
 
Far away from home, at this remote hour,
When I sprayed my body with this perfume,
Tears broke down, your black eyes fluttered, and
A storm raged all around.
 
In the dense deodar woods,
In the fading light of dusk,
Slowly, the herd of musk deer moves.
Dust of primal aroma hangs in the air.
 
Away from its herd,
This deer would still roam
In search of this ancient scent.
It wanders across the mountain slopes
With all its disquiet, with its unrest.
 
3-8-2022
 
 
 

Leave a Reply

%d bloggers like this: