నేను తిరిగిన దారులు-22

నేను పిచ్చివాడిలా ప్రదక్షిణంగా, అప్రదక్షిణంగా ఆ స్థూపం చుట్టూ అటూఇటూ తిరుగుతూ, నా చేతుల్లోకి చిక్కుతున్నట్టే చిక్కి మరుక్షణమే జారిపోతున్న ఆ అపురూపమైన ప్రశాంతి ఎటువంటిదో బోధపరచుకునే ప్రయత్నం చేశాను. ఇది ఎటువంటి జీవితప్రయత్నాలకు సార్థక్యంగా, సత్ఫలితంగా లభించగల కానుక అయిఉండవచ్చునని ఆలోచించాను.

బృహద్యాత్ర

మన జీవితాల్లో అటువంటి ఒక గోబీదశ ఒకటి ఉండేవుంటుంది. మన సంకల్పం నిజంగా ధీర సంకల్పమే అయితే మనం తప్పకుండా ఆ ఎడారిని దాటిపోగలం.